ETV Bharat / sports

వెస్టిండీస్ ప్లేయర్​కు షాక్- 5ఏళ్లు బ్యాన్ చేసిన ఐసీసీ - Devon Thomas Banned

author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 8:45 PM IST

Updated : May 2, 2024, 9:05 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Devon Thomas Banned: వెస్టిండీస్ ప్లేయర్ డేవన్ థామస్​కు ఐసీసీ షాకిచ్చింది. 5 ఏళ్లు క్రికెట్ ఆడకుండా అతడిపై నిషేధం విధించింది.

Devon Thomas Banned: వెస్టిండీస్ ప్లేయర్ డేవన్ థామస్​కు ఐసీసీ షాకిచ్చింది. అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను అతడిపై 5 ఏళ్లు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని ఐసీసీ చెప్పింది. శ్రీలంక ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్​, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్​ నిబంధనలు ఉల్లంఘిచినందుకు థామస్​పై చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది.

అయితే 2021 శ్రీలంక ప్రీమియర్ లీగ్​లో థామస్ ఫిక్సింగ్​కు పాల్పడినట్లు అతడిపై అభియోగాలు ఉన్నాయి. దీంతో ఐసీసీ అప్పట్లోనే అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. ఇక తాజా విచారణలో థామస్ కూడా తన తప్పిదాన్ని అంగీకరించాడు. దీంతో ఐసీసీ అతడిపై 5 ఏళ్లు నిషేధం విధించింది.

కాగా, 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన థామస్ 1 టెస్టు, 21 వన్డే, 12 టీ20 మ్యాచ్​ల్లో వెస్టిండీస్​కు ప్రాతినిధ్యం వహించాడు. అందులో టెస్టులో 31, వన్డేల్లో 238, టీ20లో 51 పరుగులు చేశాడు. అటు బౌలింగ్​లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇక 2022లో చివరిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ (ఆస్ట్రేలియాతో టెస్టు)​ ఆడాడు.

ఐపీఎల్​లోనూ నిషేధం: ఐపీఎల్​లో ఇటీవల కోల్​కతా నైట్​రైడర్స్ జట్టు బౌలర్​ హర్షిత్​ రానాపై వేటు పడింది. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు సీమర్‌ హర్షిత్‌ రానాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. రీసెంట్​గా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్‌ వికెట్‌ తీసిన సందర్భంలో హర్షిత్‌ రాణా సెలబ్రేట్‌ చేసుకున్న తీరుకు చర్యలు తీసుకున్నారు ఐపీఎల్ నిర్వాహకులు. రాణా తన చేతిని పోరెల్ వైపు చూపిస్తూ తిరిగి పెవిలియన్‌కు వెళ్లమని సూచించాడు. ఈ క్రమంలోనే మరోసారి ఫ్లైయింగ్‌ కిస్‌ ఇవ్వబోయి ఆగిపోయాడు. ఇది కాస్త వివాదమైంది. అతడి చర్యను తప్పుబడుతూ అందరూ విమర్శించారు. దీంతో అతనికి మ్యాచ్‌ ఫీజులో 100 శాతం జరిమానా విధించారు. ఒక మ్యాచ్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. కాగా, ఈ మ్యాచ్​లో కోల్​కతా 7 వికెట్ల తేడాతో నెగ్గింది.

డేంజర్ జోన్​లో హార్దిక్ పాండ్య - IPL 2024

ఆ ఐదుగురు అన్​లక్కీ ప్లేయర్స్​ - T20 World Cup 2024

Last Updated :May 2, 2024, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.