ETV Bharat / sports

విరాట్​ బొమ్మ గీసిన స్మృతి- డ్రాయింగ్​లో కింగ్​ 'కిరీటమే' హైలైట్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 6:43 PM IST

Updated : Feb 28, 2024, 7:11 PM IST

Smriti Mandhana Virat Kohli: మహిళా క్రికెట్ టీమ్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా హోస్ట్​తో కలిసి డ్రాయింగ్ గేమ్ ఆడింది. ఈ క్రమంలో స్మృతి గీసిన విరాట్ కోహ్లీ బొమ్మ సోషల్ మీడియాలో వైరలైంది.

Smriti Mandhana Draws Virat
Smriti Mandhana Draws Virat

Smriti Mandhana Virat Kohli: 2024 డబ్ల్యూపీఎల్​ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూ​లో పాల్గొంది. ఆర్​సీబీ ఇన్​సైడర్​ పేరుతో ప్రముఖ యాంకర్ నాగ్స్​ (దానిశ్ సైత్) ఈ ఇంటర్వ్యూను​ హోస్ట్ చేశారు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో ​స్మృతి హోస్ట్​ నాగ్స్​తో కలిసి పిక్షనరీ (డ్రాయింగ్) గేమ్​ ఆడింది. ఈ గేమ్​లో ఒకరు గీసిన డ్రాయింగ్​ను మరోకరు గెస్ చేసి చెప్పాలి.

ఈ నేపథ్యంలో స్మృతి ఫన్నీగా ఓ కార్టూన్​ గీసింది. ఆ బొమ్మకు తలపై కిరీటం పెట్టి అది ఎవరో గెస్ చేయాలని నాగ్స్​కు సవాల్ విసిరింది. అయితే ఆప్పటికే డ్రాయింగ్​ను కనిపిట్టిన నాగ్స్,​ కాసేపు తనకు తెలియనట్లుగా ఏవో ఏవో ఆన్సర్స్​ చెప్పారు. తలపై గీసిన కిరీటాన్ని చూపుతూ గెస్ చేయాలని స్మృతి అడగ్గా 'అది ఎవరో నాకు తెలుసు. అతడు నా డియరెస్ట్ ఫ్రెండ్ కింగ్ కోహ్లీ' అని అన్సర్ చెబుతాడు. ఈ వీడియోను ఆర్​సీబీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్​లో షేర్ చేసింది. అయితే క్రికెట్​లో విరాట్ కోహ్నీని ఫ్యాన్స్​ కింగ్ అని అంటుంటారు. అందుకే స్మృతి విరాట్ కార్టూన్​కు కిరీటం గీసింది. దీంతో విరాట్ 'కింగ్​' అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మ్యారేజ్ ప్రపోజల్: ఇక మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ జెయింట్స్​ మ్యాచ్ మధ్యలో ఓ ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. ఆర్​సీబీ ప్లేయర్ శ్రేయాంకా పాటిల్​కు మ్యారెజ్ ప్రపోజల్ వచ్చింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి 'నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయాంక' అని రాసి ఉన్న ప్లకార్డ్​ను ప్రదర్శించాడు. దీన్ని కెమెరామేన్ బిగ్ స్క్రీన్​లో చూపించగానే స్టేడియంలో ఉన్న అందరూ నవ్వుకున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

ఇక మ్యాచ్​ విషయానికొస్తే, ఆర్​సీబీ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. గుజరాత్ నిర్దేశించిన 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 12.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ స్మృతి మంధాన (43 పరుగులు) కీలక ఇన్నింగ్స్​తో మెరవగా, సబ్బినేని మేఘన (36*), ఎల్లిస్‌ పెర్రీ (23*) రాణించారు. దీంతో ప్రస్తుత టోర్నీలో వరుసగా రెండు విజయాలు సాధించిన ఆర్​సీబీ 4 పాయింట్లతో టేబుల్​లో టాప్ ప్లేస్​లోకి దూసుకెళ్లింది.

రెట్టింపు ఆనందంతో ఆర్సీబీ - చిన్నస్వామి వేదికగా రెండో విజయం

డబ్ల్యూపీఎల్​లో దిల్లీ బోణీ- 'షఫాలీ' వన్​సైడ్​ షో

Last Updated : Feb 28, 2024, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.