ETV Bharat / sports

ధోనీ, కోహ్లీ కాదు - తొలిసారి రూ.100 కోట్లు అందుకున్న క్రికెటర్ ఎవరో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 11:13 AM IST

Updated : Feb 7, 2024, 11:24 AM IST

పలు రకాల వాణిజ్య కంపెనీలు, సంస్థలు కోట్లు చెల్లించి మరీ క్రికెటర్లను తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తుంటాయి.అయితే భారత్​లో తొలిసారిగా ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్​గా ఉన్నందుకు రూ.100 కోట్ల డీల్ చేసుకున్న ప్లేయర్​ ఎవరో తెలుసా?

ధోనీ, కోహ్లీ కాదు - తొలిసారి రూ.100కోట్లు అందుకున్న క్రికెటర్ ఎవరో తెలుసా?
ధోనీ, కోహ్లీ కాదు - తొలిసారి రూ.100కోట్లు అందుకున్న క్రికెటర్ ఎవరో తెలుసా?

Sachin Tendulkar 100 Crore Deal : భారత్​లో క్రికెటర్స్​కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలతో సమానంగా వీరికి అభిమానులుంటారు. అందుకే పలు వాణిజ్య కంపెనీలు తమ ప్రమోషన్ కోసం క్రికెటర్స్​ను బ్రాండ్ అంబాసిడర్​గా నియమించుకుంటాయి. అందుకుగాను భారీగా సొమ్ములు ముట్ట చెపుతాయి. అయితే మన దేశంలో తొలిసారిగా ఓ వాణిజ్య సంస్థతో రూ.100 కోట్ల డీల్ చేసుకున్న ఆటగాడు ఎవరో తెలుసుకుందాం.

వివరాళ్లికో వెళితే. భారత్​తో క్రికెట్​కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్ మెుదలైందంటే చాలు చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు టీవీలకు అతుక్కుపోతారు. అందుకే పలురకాల వాణిజ్య కంపెనీలు, సంస్థలు కోట్లు చెల్లించి మరీ క్రికెటర్లను తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తుంటాయి.అయితే భారత్​లో తొలిసారిగా ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్​గా ఉన్నందుకు రూ.100 కోట్ల డీల్ చేసుకున్న ప్లేయర్​ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్. ఈ డీల్​తో అతడు సరి కొత్త రికార్డు సృష్టించాడు. 2001లో 'వరల్డ్ టెల్' అనే సంస్థతో R ఒప్పందం కుదుర్చుకున్నాడు.

'వరల్డ్ టెల్' అనేది మర్క్ మస్కర్ అనే వ్యక్తికి చెందిన చెందిన స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ సంస్థ. ఈ సంస్థతో సచిన్ చేసుకున్న ఈ మెగా డీల్ అప్పట్లో అందర్ని షాక్​కు గురిచేసింది. కంపెనీ బ్రాండ్​కు ప్రమోషన్ చేస్తే ఇంత పెద్ద మెుత్తంలో చెల్లిస్తారా అని అందరూ ఆశ్చర్యపోయారు. 2013లో సచిన్ తెందుల్కర్ అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ యాడ్​లను ఇవ్వటంలో అతడి హవా మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఐటీసీ సావన్, జియో సినిమా, బీఎమ్ డబ్ల్యూ వంటి వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్​గా కొనసాగుతున్నాడు.

అయితే ఇప్పటివరకు ఒక బ్రాండ్ అంబాసిడర్​గా అత్యధిక పారితోషికం తీసుకున్న వ్యక్తిగా టీమ్​ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ప్రముఖ షూ సంస్థ పూమాతో రూ.110 కోట్ల డీల్ విరాట్ కుదుర్చుకున్నాడు. అంతేకాకుండా ఇండియాలో ఉన్న రిచెస్ట్ క్రికెటర్​లలో ఒకడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇక టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ - రిలయన్స్, ఎస్ బీ ఐ, ఓరియో, ఇండియా సిమెంట్స్, డ్రీమ్ 11, రీబాక్ , వంటి సంస్థలకు అంబాసిడర్​గా కొనసాగుతున్నాడు.

ఫ్యాన్ మూమెంట్ - అభిమానికి సర్​ప్రైజ్ ఇచ్చిన క్రికెట్​ గాడ్​

హాయ్​ ఐపీఎల్ 2024 : అనుష్క శర్మ వర్సెస్ రితికా- హాట్​ టాపిక్​ ఇదే​!

Last Updated : Feb 7, 2024, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.