ETV Bharat / sports

'5 సెంచరీలు చేసినా ఏం లాభం? ఓడిపోయాం కదా- జట్టులో ఆ మార్పు రావాలనుకున్నా!'

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 3:22 PM IST

Updated : Jan 26, 2024, 4:43 PM IST

Rohit Sharma On Captaincy: ప్లేయర్ల వ్యక్తిగత స్కోర్ల కంటే ఐసీసీ ట్రోఫీలే ముఖ్యమన్నాడు టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ. రీసెంట్​గా మాజీ ప్లేయర్ దినేశ్ కార్తిక్​తో మాట్లాడిన రోహిత్ కెప్టెన్సీ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.

Rohit Sharma On Captaincy
Rohit Sharma On Captaincy

Rohit Sharma On Captaincy: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2019, 2023 వన్డే వరల్డ్​కప్​ల ఓటమిపై మరోసారి ఎమోషనల్ అయ్యాడు. ఇంగ్లాండ్​తో టెస్టు మ్యాచ్​కు ముందు మాజీ ప్లేయర్ దినేశ్ కార్తిక్​తో రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు, నాయకత్వ లక్షణాల గురించి చర్చించాడు. టీమ్ఇండియాకు కెప్టెన్ అవ్వడం గౌరప్రదమైందని అన్నాడు. అయితే మూడు ఫార్మాట్​లలో రెగ్యులర్ కెప్టెన్ అయ్యాక జట్టులో కొంత మార్పు తీసుకు రావాలనుకున్నట్లు తెలిపాడు. ప్లేయర్ల స్కోర్లు కేవలం నంబర్లేనని రోహిత్ అన్నాడు.

'ప్లేయర్లు గణాంకాలను దృష్టిలో పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. నేను ఇందులో చిన్న మార్పు తీసుకురావాలనుకున్నా. ప్రజలు గణాంకాలను చూడడం లేదు. ప్లేయర్ల వ్యక్తిగత స్కోర్లపై పెద్దగా ఆసక్తిగా లేరు. మంచి గేమ్ ఆడడాన్నే వారు కోరుకుంటున్నారు. ఇండియాలో గణాంకాల గురించి కాస్త ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ, 2019 వన్డే వరల్డ్​కప్​లో నేను ఐదు సెంచరీలు బాదాను. ఏంటి లాభం? ఆ టోర్నీలో ఓడిపోయాం కదా. నాకు ట్రోఫీకి కావాలి. ట్రోఫీ గెలవకుండా ఐదు, ఆరు సెంచరీలు చేసినా ఫలితం లేదు కదా!' అని అన్నాడు.

'టీమ్ఇండియాకు కెప్టెన్ అవుతున్నానని తెలిసినప్పుడు చాలా సంతోషించా. గత 7-8 ఏళ్లుగా జట్టులో కీలక ప్లేయర్​గా, వైస్​ కెప్టెన్​గా ఉన్నాను. విరాట్ కెప్టెన్సీ సమయంలో అతడు అందుబాటులో లేనప్పుడు నేనే జట్టును నడిపించా. మన దేశ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించడం ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది. టీమ్ఇండియాకు అనేక మంది గొప్ప వ్యక్తులు నాయకత్వం వహించారు' అని అన్నాడు.

'రోహిత్​'ది క్వాలిటీ కెప్టెన్సీ: ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో తొలి రోజు రోహిత్ కెప్టెన్సీ తనకు ఎంతగానో నచ్చిందని ఇయాన్ మోర్గాన్ అన్నాడు.'మైదానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ అగ్రెసివ్​గా ఉంది. అలాగే సరైన సమయంలో బౌలింగ్​లో అద్భుతమైన మార్పులు చేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రోహిత్ కెప్టెన్సీ చాలా క్వాలిటీగా ఉంది' అని మోర్గాన్ అన్నాడు. ఇక ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 246 పరుగులకు ఆలౌటైంది.

మ్యాచ్‌ మధ్యలో రోహిత్ కాళ్లు మొక్కిన కోహ్లీ అభిమాని!

ఉప్పల్‌ టెస్ట్ : స్పిన్నర్ల మ్యాజిక్​ - దంచికొట్టిన జైశ్వాల్​

Last Updated : Jan 26, 2024, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.