ETV Bharat / sports

'T20ల్లోంచి విరాట్​ను తప్పించడమే వాళ్ల పని!' - T20 World Cup

author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 3:14 PM IST

Virat Kohli Ricky Ponting: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విమర్శకులకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కౌంటర్ ఇచ్చాడు. టీమ్ఇండియాలో తన తొలి ప్రాధాన్యత విరాట్​కే ఇస్తానని పాంటింగ్ అన్నాడు.

Virat Kohli T20
Virat Kohli T20 (Source: Associated Press)

Virat Kohli Ricky Ponting: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్​పై వస్తున్న విమర్శల పట్ల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఈ విషయంలో తాను మరోసారి విరాట్​కు మద్ధతుగా నిలుస్తున్నట్లు తెలిపాడు. టీమ్ఇండియా నుంచి టీ20 వరల్డ్​కప్​నకు విరాటే తన తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నాడు. విరాట్​ను టీ20 జట్టు నుంచి తప్పిచడానికి ఇండియన్స్ అనేక కారణాలు వెతుకుతారని అన్నాడు. ​ ప్రపంకప్​ ముంగిట ఐసీసీ రివ్యూ ఈవెంట్​లో రీసెంట్​గా పాల్గొన్న పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

'టీమ్ఇండియా ఫ్యాన్స్​ ఎల్లప్పుడూ విరాట్​ను జట్టులో నుంచి తప్పించడానికి కారణాలు వెతుకుతుంటారు. లేదా ఇంకా ఎవరైన ప్లేయర్​ను చూపించి టీ20ల్లో విరాట్ కంటే వాళ్లు బెటర్ అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, ఐసీసీ ఈవెంట్లలో కీలక మ్యాచ్​ల్లో విరాట్ అదరగొట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. అంతటి క్లాస్, అనుభవం ఉన్న ప్లేయర్​ను రిప్లేస్ చెయ్యడం కష్టం. ఇక రానున్న ప్రపంచకప్​ టోర్నీలో రోహిత్​తో కలిసి విరాట్ ఇన్నింగ్స్​ ఓపెనింగ్ చేస్తాడని అనుకుంటున్నా. భారీ స్కోర్లు చేయగల విరాట్ ఓపెనింగ్ చేస్తే, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్​ కూడా పెరుగుతుంది' అని పాంటింగ్ అన్నాడు.

అలా జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు: ఇక ఐపీఎల్​లో ఆర్సీబీ పెర్ఫార్మెన్స్​ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఫుల్​ఫామ్​లో ఉన్న ఆర్సీబీ జట్టు టైటిల్ నెగ్గినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. 'ఆర్సీబీ తమ గత 6 మ్యాచ్​ల్లో ఎలా ఆడిందో చూశాం. ఈ ఫామ్​ ఇలాగే కొనసాగితే ఫైనల్​లో నెగ్గి ఛాంపియన్​గా నిలిచినా ఆశ్చర్యం లేదు' అని పాంటింగ్ అన్నాడు.

Virat Kohli IPL 2024: ప్రస్తుత సీజన్​లో విరాట్ అదగొడుతున్నాడు. ఇప్పటి వరకు 14మ్యాచ్​లు ఆడిన విరాట్ 708 పరుగుల చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

సొంత రికార్డ్​ బ్రేక్ చేసే ఛాన్స్- ఆ ఫీట్​కు అతి చేరువలో విరాట్ కోహ్లీ - IPL 2024

'రెండుసార్లు నా హార్ట్ బ్రేక్ అయ్యింది- కోలుకోడానికి కొన్ని రోజులు పట్టింది' - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.