ETV Bharat / sports

బెంగళూరు చిత్తు - హై స్కోరింగ్ మ్యాచ్​లో ముంబయి విజయం - MI vs RCB IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 11:00 PM IST

Updated : Apr 12, 2024, 6:31 AM IST

MI vs RCB IPL 2024: ఐపీఎల్‌-17ను పేలవంగా ఆరంభించి, పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియన్స్​ ఇప్పుడు అదిరే ఆటతో దూసుకుపోతోంది. గత మ్యాచ్‌లో దిల్లీని ఓడించి ఖాతా తెరిచిన హార్దిక్ సేన ఇప్పుడు బెంగళూరును కూడా చిత్తు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ఘనత సాధించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ ముంబయి హీరోలుగా నిలిచారు.

MI vs RCB IPL 2024
MI vs RCB IPL 2024

MI vs RCB IPL 2024 : 2024 ఐపీఎల్​లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో స్టార్ జట్లు ముంబయి ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురువారం తలపడ్డాయి. ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్​లో హార్దిక్ సేన గెలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చిత్తుగా ఓడించింది. మొత్తంగా ఆరు మ్యాచ్‌ల్లో ఐదో ఓటమితో ప్లేఆఫ్స్‌ అవకాశాలను ఆర్సీబీ సంక్లిష్టం చేసుకుంది.

197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది ముంబయి. ఇన్నింగ్స్ ఘనంగా ఆరంభించిన ముంబయి ఇండియన్స్ చివరి వరకు దూకుడును ప్రదర్శించింది. ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 7×4, 5×6 సాయంతో 69 పరుగులు) సూపర్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. క్రమం తప్పకుండా బౌండరీలు బాదుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అటు రోహిత్ (38 పరుగులు, 24 బంతుల్లో; 3x4, 3x6) కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇషాన్​కు సహకారం అందించాడు. వీరిద్దరూ తొలి వికెట్​కు 53 బంతుల్లోనే 101 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆకాశ్ దీప్ బౌలింగ్​లో ఇషాన్, జాక్ విల్స్ బంతికి రోహిత్ క్యాచౌట్​గా పెవిలియన్ చేరారు. ఇక వన్​డౌన్​లో వచ్చిన సూర్యకుమార్(19 బంతుల్లో 5×4, 4×6 సాయంతో 52 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే అర్ధ శతకం (52) పూర్తి చేశాడు. అలా వీరి విధ్వంసక బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ముంబయి 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఫాఫ్ డూప్లెసిస్ (61 పరుగులు), రజత్ పటీదార్ (50 పరుగులు), దినేశ్ కార్తిక్ (53* పరుగులు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (3), విల్ జాక్స్ (9), మ్యాక్స్​వెల్ (0) విఫలమయ్యారు. ఇక ముంబయి బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇక గెరాల్డ్ కాట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

నాలుగో బౌలర్​గా - ఈ మ్యాచ్​లో ముంబయి బౌలర్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​లో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన, నాలుగో బౌలర్​గా రికార్డు కొట్టాడు. అతడి కన్నా ముందు జేమ్స్ ఫాల్క్​నర్, జయదేవ్ ఉనాత్కత్, భువనేశ్వర్ కుమార్ ఈ ఫీట్ సాధించారు. అలాగే ఆర్సీబీపై 5 వికెట్లు తీసిన ఏకైక బౌలర్​గానూ బుమ్రా రికార్డు సృష్టించాడు.

ఆకాశ్​ కారులో రోహిత్! - హిట్​మ్యాన్​ కోసం ఆ ఫ్రాంచైజీ రెడీ! - Rohit Sharma Mumbai Indians

IPLలో చాహల్ అరుదైన ఘనత- షేన్ వార్న్ రికార్డ్ బ్రేక్ - Yuzvendra Chahal IPL 2024

Last Updated :Apr 12, 2024, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.