ETV Bharat / sports

IPL 2024 షెడ్యూల్ ఔట్- తొలి పోరు చెన్నై- బెంగళూరు మధ్యే

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 5:46 PM IST

Updated : Feb 22, 2024, 6:33 PM IST

IPL 2024 Schedule:
IPL 2024 Schedule:

IPL 2024 Schedule: 2024 ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న లీగ్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ చెన్నై- బెంగళూరు మధ్య జరగనుంది.

IPL 2024 Schedule: 2024 ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న లీగ్ ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో బోర్డు తొలుత 21 మ్యాచ్​ల షెడ్యూల్​ను ప్రకటించింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వరకు ఐపీఎల్ 17న సీజన్ తొలి విడత టోర్నీ జరగనుంది. ఇందులో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్​లు ఉన్నాయి. ఇక మిగిలిన మ్యాచ్​ల షెడ్యూల్ సాధారణ ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత ప్రకటించే ఛాన్స్ ఉంది.

అయితే భారత్​లో ఏప్రిల్- మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయినప్పటికీ ఈసారి టోర్నమెంట్​ను పూర్తిగా భారత్​లోనే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఐపీఎల్ లీగ్‌ ఛైర్మన్‌ అరుణ్ ధుమాల్‌ ఇదివరకే స్పష్టం చేశారు. ఇక ఈ ఎడిషన్​లో ప్లేఆఫ్స్ కలుపుకొని మొత్తం 74 మ్యాచ్​లు జరగనున్నాయి. అందులో 21 మ్యాచ్​ల షెడ్యూల్ గురువారం రిలీజైంది.

ఏయే మ్యాచ్​లు ఎప్పుడంటే?

  • మార్చి 22: చెన్నై X బెంగళూరు (చెన్నై)
  • మార్చి 23: పంజాబ్‌ X దిల్లీ (మొహాలీ)
  • మార్చి 23: కోల్‌కతా X హైదరాబాద్‌ (కోల్‌కతా)
  • మార్చి 24: రాజస్థాన్ X లఖ్‌నవూ (జైపుర్)
  • మార్చి 24: గుజరాత్‌ X ముంబయి (అహ్మదాబాద్‌)
  • మార్చి 25: బెంగళూరు X పంజాబ్ (బెంగళూరు)
  • మార్చి 26: చెన్నై X గుజరాత్‌ (చెన్నై)
  • మార్చి 27: హైదరాబాద్‌ X ముంబయి (హైదరాబాద్‌)
  • మార్చి 28: రాజస్థాన్‌ X దిల్లీ (జైపుర్)
  • మార్చి 29: బెంగళూరు X కోల్‌కతా (బెంగళూరు)
  • మార్చి 30: లఖ్‌నవూ X పంజాబ్‌ (లఖ్‌నవూ)
  • మార్చి 31: గుజరాత్ X హైదరాబాద్ (అహ్మదాబాద్‌)
  • మార్చి 31: దిల్లీ X చెన్నై (వైజాగ్‌)
  • ఏప్రిల్ 01: ముంబయి X రాజస్థాన్‌ (ముంబయి)
  • ఏప్రిల్ 02: బెంగళూరు X లఖ్‌నవూ (బెంగళూరు)
  • ఏప్రిల్ 03: దిల్లీ X కోల్‌కతా (వైజాగ్‌)
  • ఏప్రిల్ 04: గుజరాత్ X పంజాబ్ (అహ్మదాబాద్‌)
  • ఏప్రిల్ 05: హైదరాబాద్‌ X చెన్నై (హైదరాబాద్‌)
  • ఏప్రిల్‌ 6: రాజస్థాన్‌ X బెంగళూరు (జైపుర్)
  • ఏప్రిల్ 7: ముంబయి X దిల్లీ (ముంబయి)
  • ఏప్రిల్ 7: లఖ్‌నవూ X గుజరాత్ (లఖ్‌నవూ)

గతంలో విదేశాల్లో: అయితే ఐపీఎల్​ ప్రారంభమయ్యాక ఇప్పటిదాకా దేశంలో 3 సాధారణ ఎన్నికలు జరిగాయి. సెక్యురిటీ కారణాల వల్ల అందులో 2009 ఎడిషన్​​ పూర్తి టోర్నమెంట్​ను బీసీసీఐ సౌతాఫ్రికాలో నిర్వహించింది. ఆ తర్వాత 2014ఎడిషన్​లో తొలి 20 మ్యాచ్​లను బీసీసీఐ యూఏఈ (దుబాయ్)లో జరిపింది. ఇక ఎన్నికల తర్వాత టోర్నీని మళ్లీ భారత్​కు షిఫ్ట్ చేసింది. కానీ, 2019లో మాత్రం పూర్తి టోర్నీని సక్సెస్​ఫుల్​గా భారత్​లోనే నిర్వహించింది.

IPL ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- ఫస్ట్ మ్యాచ్​ ఎప్పుడంటే?

WPL 2024కు రంగం సిద్ధం - అమ్మాయిలు రెడీగా ఉన్నారా?

Last Updated :Feb 22, 2024, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.