ETV Bharat / sports

ఐపీఎల్​లో కేకేఆర్ జర్నీ- గంభీర్ రాకతో కోల్'కథ' మారేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 9:16 AM IST

IPL 2024 KKR
IPL 2024 KKR

IPL 2024 KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 16ఏళ్లలో రెండుసార్లు ఛాంపియన్​గా నిలిచింది. ఇక దశాబ్ద కాలంగా నెరవేరని టైటిల్ కల ఈసారైనా సాకారం అవుతుందా?

IPL 2024 KKR: ఐపీఎల్​లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే ప్రారంభంలో పేలవ ప్రదర్శన కనబర్చిన కేకేఆర్​పై ఎవరికీ పెద్దగా ఆశలు లేకుండా పోయాయి. కానీ, అప్పటి కెప్టెన్ గంభీర్​ రాకతో కేకేఆర్ ఏకంగా మూడేళ్ల వ్యవధిలో (2012, 2014) రెండు టైటిళ్లు సాధించి ఔరా అనిపించింది. దీంతో ఐపీఎల్​లో కేకేఆర్ ఫ్యాన్ బేస్ అమాంతంగా పెరిగిపోయింది.

అయితే 2015 నుంచి ఆ జట్టు నిలకడ తప్పింది. ప్రతి సీజన్​లో ఒకట్రెండు మ్యాచ్​ల్లో తప్పా అద్భుత విజయాలు సాధించడంలో కేకేఆర్ విఫలమైంది. దాంతోపాటు గంభీర్ జట్టు మారడం, ఆ తర్వాత దినేశ్ కార్తిక్, నితీశ్ రానా, ఇయాన్ మోర్గాన్ వంటి పలువురు ప్లేయర్లు నాయకత్వం వహించారు. ఆయినప్పటికీ కేకేఆర్​కు పూర్వ వైభవం తీసుకురాలేదు. ఇక 2022లో శ్రేయస్ అయ్యర్​ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. గతేడాది గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న అయ్యర్ ఈసారి బరిలో దిగే ఛాన్స్ ఉంది.

ఇక గతేడాది డిసెంబర్​లో జరిగిన వేలంలో ఐపీఎల్​ హిస్టరీలోనే రికార్డ్ ధరకు కేకేఆర్ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెస్ స్టార్క్​ను కొనుగోలు చేసింది. స్టార్క్​తో పాటు స్పిన్నర్‌ ముజీబ్‌ రెహ్మాన్‌ (అఫ్గానిస్థాన్‌), హిట్టర్‌ షెఫానీ రూథర్‌ఫర్డ్‌ (వెస్టిండీస్‌), పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ (ఇంగ్లాండ్‌)ను కూడా కేకేఆర్​ వేలంలో దక్కించుకుంది. మరి ఈసారైనా యంగ్ టాలెండెట్ అయ్యర్ కేకేఆర్​కు దశాబ్ద కాలంగా ఉన్న టైటిల్ కలను నెరవేరుస్తాడో లేదో చూడాలి.

బలాలు: కోల్​కతాకు ఈసారి బౌలింగ్​ పెద్ద బలంగా మారనుంది. మిచెల్‌ స్టార్క్‌, చమీర, ముజీబ్‌ రెహ్మాన్‌, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణా, సుయాశ్‌ శర్మ ఉన్నారు, ఇక ఆల్​రౌండర్లు రస్సెల్, నరైన్ అవసరమైన్నప్పుడు జట్టుకు బ్రేక్ ఇవ్వగల సత్తా ఉన్నావాళ్లు. ఇక బ్యాటింగ్​లో కెప్టెన్ అయ్యర్ మంచి ఫామ్​లో ఉన్నాడు. నితీశ్‌ రాణా, గుర్బాజ్‌, రసెల్‌, షెఫానీ రూథర్‌ఫర్డ్‌, ఫిల్‌ సాల్ట్‌తో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంది. అయితే గతేడాది సిక్సర్ హీరో రింకూపైనే అందరి కళ్లున్నాయ్. బ్యాటింగ్, బౌలింగ్​తో రింకూ ఈ సీజన్​లో కూడా రాణిస్తే కేకేఆర్​కు అతి పెద్ద బలం అవుతాడు. ఇక గంభీర్ తిరిగి మెంటార్​గా జట్టుతో చేరడం కూడా కేకేఆర్​కు కలిసొచ్చే అంశమే.

బలహీనతలు: కెప్టెన్ అయ్యర్ తరచూ గాయాల బారిన పడుతుండడం కేకేఆర్​కు ఆందోళన కలిగించే విషయమే. రస్సెల్, రింకూ, నరైన్ తప్పితే చెప్పుకోదగ్గ ఆల్​రౌండర్​ జట్టులో లేడు. ఈ ముగ్గురిలో కూడా రింకూ తప్ప మిగతా ఇద్దరూ ఫామ్​లో లేరు. ఇక ఐపీఎల్​ అరంగేట్ర సీజన్​లో అదరగొట్టిన యంగ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ కూడా గాడిలో పడాల్సి ఉంది.

2024 జట్టు: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), నితీశ్‌ రాణా, వెంకటేశ్‌ అయ్యర్‌, రింకు సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, చేతన్‌ సకారియా, సుయాశ్‌ శర్మ, కేఎస్‌ భరత్‌, మనీష్‌ పాండే, హర్షిత్‌ రాణా, రఘువంశీ, అనుకుల్‌రాయ్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, సకిబ్‌ హుస్సేన్‌, వైభవ్‌ అరోరా, మిచెల్‌ స్టార్క్‌, ఆంద్రి రసెల్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌, సునీల్‌ నరైన్‌, ముజీబ్‌ రెహ్మాన్‌, దుష్మంత చమీర, షెఫానీ రూథర్‌ఫర్డ్‌, ఫిల్‌ సాల్ట్‌.

కీలక ఆటగాళ్లు: శ్రేయస్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌, మిచెల్‌ స్టార్క్‌, రసెల్‌.

ఉత్తమ ప్రదర్శన: 2012, 2014లో ఛాంపియన్‌.

KKR ఫ్యాన్స్​కు షాకింగ్ న్యూస్- ఐపీఎల్​కు అయ్యర్ దూరం!

లఖ్​నవూకు గంభీర్​ గుడ్​బై - మళ్లీ కోల్​కతాతో జర్నీ స్టార్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.