ETV Bharat / sports

KKR ఫ్యాన్స్​కు షాకింగ్ న్యూస్- ఐపీఎల్​కు అయ్యర్ దూరం!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 11:26 AM IST

Updated : Mar 14, 2024, 11:46 AM IST

Shreyas Iyer IPL 2024
Shreyas Iyer IPL 2024

Shreyas Iyer IPL 2024: ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కాకముందే ఆయా ఫ్రాంచైజీలను ప్లేయర్ల గాయాలు బెంబేలిత్తిస్తున్నాయి. గాయాల కారణంగా ఇటీవల ఇంగ్లాండ్ బ్యాటర్ బ్రూక్, మహ్మద్ షమీ తదితరులు దూరం అయ్యారు. తాజాగా ఈ లిస్ట్​లో కేకేఆర్ కెప్టెన్ అయ్యర్ చేరనున్నట్లు తెలుస్తోంది.

Shreyas Iyer IPL 2024: 2024 ఐపీఎల్​కు ముందు కోల్​కతా నైట్​రైడర్స్ ఫ్యాన్స్​కు బ్యాడ్ ​న్యూస్. గాయం కారణంగా కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ 17 ప్రారంభ మ్యాచ్​లకు అందుబాటులో ఉండడం కష్టమేనని కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ నిబంధనల మేరకు ప్రస్తుతం రంజీలో ఆడుతున్న అయ్యర్ ఫైనల్​లో ముంబయి తరఫున కీలక పరుగులు చేశాడు. విదర్భతో జరుగుతున్న టైటిల్ పోరు మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో అయ్యర్ 95 పరుగులు సాధించాడు.

అయితే ఇటీవల వెన్ను నొప్పి నుంచి కోలుకొని రంజీలో ఆడుతున్న అయ్యర్​కు గాయం మళ్లీ ఇబ్బంది పెడుతోదట. దీంతో రంజీ ముగిసిన తర్వాత అయ్యర్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడని తెలుస్తోంది. 'శ్రేయస్‌ అయ్యర్‌కు వెన్ను నొప్పి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతోంది. ఈ కారణంగానే రంజీ ఫైనల్​లో ఐదో రోజు ఫీల్డింగ్​కు రాలేదు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతాడు. దీంతో రాబోయే ఐపీఎల్​లో ప్రారంభ మ్యాచ్​లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది' అని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై కేకేఆర్ యాజమాన్యం నుంచి త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

గతేడాది ఇదే సమస్యతో ఆటకు దూరమైన అయ్యర్ మళ్లీ 2023 వరల్డ్​కప్​ సమయానికి అందుబాటులోకి వచ్చాడు. ఇక రీసెంట్​గా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో మరోసారి వెన్ను నొప్పి అయ్యర్​ను ఇబ్బంది పెట్టడం వల్ల మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో రంజీలో ఆడుతున్న అయ్యర్​కు మళ్లీ ఇదే సమస్య పునరావృతం అయ్యింది. ఇక అయ్యర్ గైర్హాజరీలో సీనియర్ బ్యాటర్ మనీశ్ పాండే అతడిని రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇక యంగ్ బ్యాటర్ నితీశ్ రానా కేకేఆర్​ కెప్టెన్సీగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. ఇక 2024 ఐపీఎల్​లో మార్చి 23న కేకేఆర్ తొలి మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​తో తలపడాల్సి ఉంది.

కేకేఆర్ షెడ్యూల్

మ్యాచ్ఎప్పుడుఎవరితోఎక్కడ
1మార్చి 23సన్​రైజర్స్​ హైదరాబాద్కోల్​కతా
2మార్చి 29రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెంగళూరు
3.ఏప్రిల్ 03దిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్టణం

శ్రేయస్​ అయ్యర్ ఈజ్​ బ్యాక్​- KKR కెప్టెన్​గా నియామకం

లఖ్​నవూకు గంభీర్​ గుడ్​బై - మళ్లీ కోల్​కతాతో జర్నీ స్టార్ట్

Last Updated :Mar 14, 2024, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.