ETV Bharat / sports

'ఆ పిచ్​పై 230 ఈజీ టార్గెట్ కాదు- వాళ్లను జడ్జ్​ చేయలేను!'

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 1:36 PM IST

Ins Vs Eng 1sr Test Rahul Dravid
Ins Vs Eng 1sr Test Rahul Dravid

Ins Vs Eng 1st Test Rahul Dravid: సొంతగడ్డపై టెస్టు ఓటమిపై టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. జట్టులోని యంగ్ ప్లేయర్లకు సపోర్ట్​గా మాట్లాడాడు.

Ins Vs Eng 1st Test Rahul Dravid: ఇంగ్లాండ్​తో సొంత గడ్డపై ఓటమి తర్వాత టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. తొలి ఇన్నింగ్స్​లో భారత్​ అదనంగా 70 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అన్నాడు. ఆ ఇన్నింగ్స్​లో ముగ్గురు బ్యాటర్లు (జైశ్వాల్, రాహుల్, జడేజా) 80+ స్కోర్లను శతకాలుగా మార్చడంలో విఫలమయ్యారని అన్నాడు. ఇక యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ పేలవ ప్రదర్శనపై కూడా రాహుల్ మాట్లాడాడు.

'యంగ్ ప్లేయర్లను అంత తొందరగా జడ్జ్​ చేయలేను. మా కుర్రాళ్లు టాలెంటెడ్. ఆ పిచ్​పై 230 పరుగులు ఛేదించడం అంత సులువేమీ కాదు. ఉప్పల్​ గ్రౌండ్​ ఛాలెంజింగ్ పిచ్. ఆ పిచ్​ను అర్థం చేసుకోవడం పెద్ద టాస్క్. వాళ్లు (యంగ్ ప్లేయర్లు) డొమెస్టిక్​ టోర్నీల్లో అనేక మ్యాచ్​లు ఆడి, ఇక్కడిదాకా (టీమ్ఇండియా జట్టుకు) వచ్చారు. వాళ్లు ఇంతా మెరుగయ్యేందుకు సమయం పట్టవచ్చు. వాళ్లు నెట్స్​లో కూడా చాలా కష్టపడతారు' అన్నాడు.

Shubman Gill Test Stats: అయితే శుభ్​మన్ గిల్ కొన్ని రోజులుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. రీసెంట్​గా ముగిసిన సౌతాఫ్రికా పర్యటన సహా చివరి 10 ఇన్నింగ్స్​ల్లో గిల్ ఒక్కసారి 50+ స్కోర్ చేయలేదు. అతడు చివరి 10 ఇన్నింగ్స్​ల్లో వరుసగా 0, 23, 10, 36, 26, 2, 29*, 10, 6, 18 పరుగులు చేశాడు. ఓవరాల్​గా టెస్టు కెరీర్​లో 39 మ్యాచ్​ల్లో 1063 పరుగులు చేశాడు. కాగా, అతడి టెస్టు సగటు 29.53కి పడిపోయింది.

మ్యాచ్ విషయానికొస్తే: ఇంగ్లాండ్​తో ఐదు టెస్టు మ్యాచ్​ల సిరీస్​లో తొలి పోరులో భారత్ డీలా పడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెరీర్​లో తొలి టెస్టు ఆడిన ఇంగ్లాండ్ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ 7 వికెట్లతో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్​ను కుప్పకూల్చాడు. ఈ విజయంతో 5 మ్యాచ్​ల సిరీస్​లో 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య విశాఖప్టటణం వేదికగా ఫిబ్రవరి 02- 06 రెండో మ్యాచ్ జరగనుంది.

  • Rahul Dravid said, "we'll have to counter Bazball. It's important that we respond. We need to come up with some plans and strategies". pic.twitter.com/BUeNWzIll4

    — Mufaddal Vohra (@mufaddal_vohra) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీమ్ఇండియాకు షాక్- రెండో టెస్ట్​కు ఆ స్టార్ ప్లేయర్ దూరం!

ఉప్పల్​ టెస్ట్​లో భారత్ ఓటమి - 7 వికెట్లతో చెలరేగిన ఇంగ్లాండ్​ స్పిన్నర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.