ETV Bharat / sports

టీమ్ఇండియాకు షాక్- రెండో టెస్ట్​కు ఆ స్టార్ ప్లేయర్ దూరం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 11:11 AM IST

Updated : Jan 29, 2024, 11:18 AM IST

Ravindra Jadeja Injury: టీమ్ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్​తో తొలి టెస్టు మ్యాచ్​లో గాయపడ్డాడు. దీంతో అతడు రెండో మ్యాచ్​ ఆడేది అనుమానంగా ఉంది.

Ravindra Jadeja Injury
Ravindra Jadeja Injury

Ravindra Jadeja Injury: ఇంగ్లాండ్​తో తొలి టెస్టు మ్యాచ్​లో ఓడి షాక్​లో ఉన్న భారత్​కు మరో ఎదురుదెబ్బ. స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్​కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో జడేజా గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్​లో పరుగు తీస్తుండగా వేగంగా పరిగెత్తడం వల్ల జడేజా అతడి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఇబ్బందిపడుతూనే మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం అతడికి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ అనంతరం హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దీనిపై మాట్లాడాడు. 'ఇంకా ఫిజియోను సంప్రదించలేదు. ఇప్పుడే అతడి పరిస్థితి గురించి ఏమీ చెప్పలేం' అని అన్నాడు.

జడ్డూ గాయం తీవ్రతపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. అయితే ఎలాంటి చీలిక లేకుండా కేవలం కండరాలు పట్టేసినా డాక్టర్లు కనీసం వారం పాటు విశ్రాంతి సూచించే ఛాన్స్ ఉంది. మరో నాలుగు రోజుల్లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. దీంతో అతడు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా?అనేది అనుమానంగానే కన్పిస్తోంది. ఫిబ్రవరి 02-06 మధ్య విశాఖపట్టణం వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో జట్టుతో కలిసి జడేజా వైజాగ్‌ వెళ్తాడా? లేదా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి పంపిస్తారా? అన్నదానిపై బీసీసీఐ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.

ఇక ఈ మ్యాచ్​లో జడ్డూ ఆల్​రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్​లో (87 పరుగులు) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇక బౌలింగ్​లోనూ జడేజా తన మార్క్ చూపించాడు. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్ విషయానికొస్తే: ఇంగ్లాండ్​తో ఐదు టెస్టు మ్యాచ్​ల సిరీస్​లో తొలి పోరులో భారత్ డీలా పడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెరీర్​లో తొలి టెస్టు ఆడిన ఇంగ్లాండ్ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ 7 వికెట్లతో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్​ను కుప్పకూల్చాడు. ఈ విజయంతో 5 మ్యాచ్​ల సిరీస్​లో 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య విశాఖప్టటణం వేదికగా ఫిబ్రవరి 02- 06 రెండో మ్యాచ్ జరగనుంది.

ఉప్పల్​ టెస్ట్​లో భారత్ ఓటమి - 7 వికెట్లతో చెలరేగిన ఇంగ్లాండ్​ స్పిన్నర్​

అండర్‌19 ప్రపంచకప్‌ - భారత్‌ ఘన విజయం

Last Updated : Jan 29, 2024, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.