ETV Bharat / sports

గిల్ హాఫ్​ సెంచరీ - నాలుగో టెస్టులో టీమ్ఇండియా విక్టరీ

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 1:39 PM IST

Updated : Feb 26, 2024, 3:56 PM IST

India Vs England 4th Test
India Vs England 4th Test

India Vs England 4th Test : రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలా 3 -1లో భారత జట్టు లీడింగ్​లో ఉంది.

India Vs England 4th Test : రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా విజయం సాధించింది. ఇంగ్లీష్​ జట్టు నిర్దేశించిన 192 పరుగులను ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. నాలుగో రోజును 40/0 స్కోరుతో ప్రారంభించిన భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ లక్ష్యచేధనలో సక్సెస్​ సాధించింది. ఇక భారత జట్టులో రోహిత్ శర్మ (55), యశస్వీ జైస్వాల్​ (37) రాణించగా, ధ్రువ్​ జురెల్​ (39*) ఎప్పటిలాగే కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. ఇక జురెల్​తో పాటు శుభ్​మన్​ గిల్ (52*) జట్టుకు భారీ స్కోర్​ను అందించాడు. అర్ధశతకంతో రాణించాడు. ఆరో వికట్ సమయానికి ధ్రువ్​, గిల్ 72 పరుగుల పార్ట్​నర్​షిప్​ను జోడించారు.

మరోవైపు యంగ్ ప్లేయర్లు సర్ఫరాజ్‌ ఖాన్, రజత్‌ పటీదార్​ డకౌట్లుగా పెవిలియన్‌ బాట పట్టారు. రవీంద్ర జడేజా (4) కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. ఇక ఇంగ్లాండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 3 వికెట్లతో రాణించగా, టామ్‌ హార్ట్‌లీ, జోరూట్ చెరో వికెట్​ను ఖాతాలో వేసుకున్నారు. ఇక రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలకంగా ఉన్న ధ్రువ్ జురెల్‌ను 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు వరించింది.

మ్యాచ్​ సాగిందిలా :
నాలుగో రోజులో ఓవర్‌ నైట్‌ 40/0 స్కోరుతో లక్ష్యఛేదనను ప్రారంభించిన టీమ్ఇండియా తొలుత మంచి ఫామ్​లోనే కనిపించింది. అయితే యశస్వి జైస్వాల్ కొట్టిన బాల్​ను అండర్సన్‌ సూపర్ డైవ్​లో ముందుకు దూకి అందుకొన్నాడు. దీంతో తొలి వికెట్‌ సమయానికి ఓపెనర్లు 84 పరుగులు జోడించినట్లైంది. మొదటి వికెట్​ పడ్డాక ఆచితూచి ఆడిన రోహిత్ శర్మ కాసేపటికీ హాఫ్‌ సెంచరీ చేసి వెనుతిరిగాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి 118/3 స్కోరుగా నమోదైంది. అయితే బ్రేక్ తర్వాత షోయబ్‌ బషీర్‌ ఒకే ఓవర్‌లో రవీంద్ర జడేజా, సర్ఫరాజ్‌ ఖాన్‌ ఔటై పెవిలియన్​కు చేరుకున్నారు. అయితే ఇంగ్లాండ్ స్పిన్నర్లు వేసిన బంతులను కట్టుదిట్టంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు ధ్రువ్- గిల్. దీంతో నాలుగో టెస్ట్​​ టీమ్ఇండియా వశమైంది.

ఆండర్సన్ సూపర్ డైవ్​ - 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే

యశస్వి జైశ్వాల్‌ సరికొత్త చరిత్ర - 92 ఏళ్లలో ఇదే తొలిసారి!

Last Updated :Feb 26, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.