ETV Bharat / sports

ఫైనల్​లో తప్పని నిరాశ - పోరాడి ఓడిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 6:23 PM IST

Updated : Jan 21, 2024, 6:59 PM IST

ఫైనల్లో తప్పని నిరాశ - సాత్విక్‌, చిరాగ్‌ ఓటమి
ఫైనల్లో తప్పని నిరాశ - సాత్విక్‌, చిరాగ్‌ ఓటమి

Chirag Shetty and Rankireddy : ఇండియా ఓపెన్‌ 2024 టోర్నీ ఫైనల్​లో భారత డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో పోరాడి ఓడింది.

India Open 2024 Finals Chirag Shetty and Rankireddy : భారత డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టికి సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ 2024 ఫైనల్స్​లో నిరాశ ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. ఫలితంగా టైటిల్‌ను కైవసం చేసుకోలేకపోయింది.

ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన తుదిపోరులో మూడో సీడ్‌, కొరియాకు చెందిన మిన్ హ్యూక్ కాంగ్ - సీయుంగ్ జే సియో ద్వయం చేతిలో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ఓటమి పాలయ్యారు. 21-15 11-21 18-21 తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమితో భారత జోడి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ ఏడాది సాత్విక్ జోడీ వరుసగా రెండో ఫైనల్‌లో ఓడింది. గత వారం మలేసియా ఓపెన్‌లోనూ భారత జోడీకి నిరాశ ఎదురైన విషయం తెలిసిందే.

మ్యాచ్ సాగిందిలా : ఈ ఇండియా ఓపెన్‌ ఫైనల్‌లో తొలి గేమ్‌లో సాత్విక్ ద్వయం ఈజీగానే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ రౌండ్​ కేవలం 17 నిమిషాలోనే ముగిసింది. అయితే రెండో గేమ్​లో కొరియా జోడీ పట్టు బిగించింది. గేమ్‌ ఆరంభం నుంచే పంజుకున్న ఈ ద్వయం ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా పాయింట్లను అందుకుంటూ 21-11తో మ్యాచ్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌ కూడా హోరా హోరీగా సాగింది. మొదట 8-12తో వెనకపడిన భారత జోడీ(సాయిరాజ్​​ - చిరాగ్​ శెట్టి) తర్వాత పట్టువదలకుండా గొప్పగా పోరాడింది. వీరిద్దరు 16-17తో స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించారు. కానీ కొరియా షట్లర్లు కూడా దూకుడును ప్రదర్శించి మ్యాచ్‌ను గెలుచుకున్నారు.

India Open 2024 Semi Finals : అంతకుముందు పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడి టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతలు, మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ వూయ్ యిక్‌లపై విజయం సాధించింది. 21-18 21-14తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

  • 🏸 Unbelievable Action!

    Our #TOPScheme shuttlers Satwik & Chirag 🇮🇳 showcased sheer brilliance but lost a close battle to end as Runners-up of #IndiaOpen750. Engaging in an electrifying battle against Korean aces S.J. Seo and M.H. Kang, the boys gave it their all!

    A thrilling… pic.twitter.com/srScOO0yRo

    — SAI Media (@Media_SAI) January 21, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రజ్ఞానంద రికార్డ్​ - విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి నెం.1గా

భారత్​కు తిరిగి వస్తా - సానియాతో కలిసి పని చేస్తా : జకోవిచ్

Last Updated :Jan 21, 2024, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.