ETV Bharat / sports

'రోహిత్' నయా రికార్డ్- బజ్​బాల్​ క్రికెట్​లో ఇంగ్లాండ్ తొలిసారి

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 3:41 PM IST

Updated : Feb 26, 2024, 3:56 PM IST

Ind vs Eng Test 2024 Record
Ind vs Eng Test 2024 Record

Ind vs Eng Test 2024 Record: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. రాంచీ టెస్టులో విజయంతో రోహిత్ ఈ ఫీట్ అందుకున్నాడు.

Ind vs Eng Test 2024 Record: ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే దక్కించుకుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఘనత అందుకున్నాడు. ఇంగ్లాండ్​ బజ్​బాల్ వ్యూహంతో ఆడడం ప్రారంభించిన తర్వాత ఆ జట్టును ద్వైపాక్షిక సిరీస్​లో ఓడించిన తొలి కెప్టెన్​గా నిలిచాడు రోహిత్. అటు ఇంగ్లాండ్​ కెప్టెన్​గా బెన్​స్టోక్స్, కోచ్​గా మెక్​కల్లమ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ జట్టు టెస్టు సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి.

బజ్​బాల్ వ్యూహంతో టెస్టుల్లో ఇంగ్లాండ్ సంచలన విజయాలు నమోదు చేసింది. బజ్​బాల్ వ్యూహంతో ఇంగ్లాండ్ ఇప్పటివరకు 8 సిరీస్​లు ఆడింది. అందులో 4 సిరీస్​లు నెగ్గగా, 3 సిరీస్​లను డ్రా చేసుకుంది. ఇదే వ్యూహంతో భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ తొలిసారి సిరీస్​ను చేజార్చుకుంది. ప్రస్తుత సిరీస్​లో ఇంగ్లాండ్ వరుసగా మూడు మ్యాచ్​ల్లో ఓడింది. బెన్​ స్టోక్స్​ కెప్టెన్​గా వరుసగా మూడు టెస్టుల్లో ఓడడం కూడా ఇదే తొలిసారి. బజ్​బాల్ ఆటతో ప్రత్యర్థులను భయపెట్టిన ఇంగ్లాండ్​కు టీమ్ఇండియా భారత గడ్డపై షాక్ ఇచ్చింది.

రోహిత్@4000: రోహిత్ ఇదే టెస్టులో మరో ఘనత సాధించాడు. మూడో రోజు రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన రోహిత్ టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. 58 టెస్టులు ఆడిన రోహిత్ 100 ఇన్నింగ్స్​ల్లో ఈ మైలురాయికి చేరుకున్నాడు. ఇప్పటిదాకా 100 ఇన్నింగ్స్​ల్లో 4034 పరుగులు చేశాడు. అందులో 11 సెంచరీలు. 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, నాలుగో టెస్టులో ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 191 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (55 పరుగులు), శుభ్​మన్ గిల్ (52*) హాఫ్ సెంచరీలతో రాణించారు. యశస్వి జైశ్వాల్ (37 పరుగులు), అరంగేట్ర బ్యాటర్ ధ్రువ్ జురెల్ (39* పరుగులు) ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, టామ్ హార్ల్టీ, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.

స్కోర్లు:

  • ఇంగ్లాండ్- 353/10 & 145/10
  • భారత్- ​307/10 & 192/5.

గిల్ హాఫ్​ సెంచరీ - నాలుగో టెస్టులో టీమ్ఇండియా విక్టరీ

ఆండర్సన్ సూపర్ డైవ్​ - 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే

Last Updated :Feb 26, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.