ETV Bharat / sports

భారత్xఇంగ్లాండ్ టెస్టు: డే 3 కంప్లీట్- ఇద్దరికీ నాలుగో రోజే కీలకం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 4:54 PM IST

Ind vs Eng 2nd Test 2024: విశాఖపట్టణం టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్​లో 67-1తో నిలిచి, ఇంకా 332 పరుగులు వెనుకంజలో ఉంది.

Ind vs Eng 2nd Test 2024
Ind vs Eng 2nd Test 2024

Ind vs Eng 2nd Test 2024: భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 67-1తో ఉంది. ఇంగ్లాండ్ ఇంకా 332 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో జాక్ క్రాలీ (28), రెహాన్ అహ్మద్ (9) ఉన్నారు. బెన్ డకెట్ (28) ఔటయ్యాడు. అశ్విన్ వికెట్ దక్కించుకన్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్​లో 255 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 4, రెహాన్ అహ్మద్ 3, జేమ్స్ అండర్సన్ 2, షోయబ్ బాషిర్ 1 వికెట్ పడగొట్టారు.

గిల్ సూపర్ సెంచరీ: 28-0 ఓవర్​నైట్ స్కోర్​తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్​కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13), యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (17) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ ఇద్దరినీ పేసర్ జేమ్స్​ అండర్సన్ ఔట్ చేశాడు. ఇక బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (29), రజత్ పటీదార్ (9) మరోసారి నిరాశ పర్చారు. ఈ క్రమంలో ఆల్​రౌండర్​ అక్షర్ పటేల్​తో కలిసి గిల్ 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే చాలాకాలం తర్వాత గిల్ టెస్టుల్లో సాధించాడు. ఈ ఇన్నింగ్స్​తో తన ఫామ్​పై వస్తున్న అనుమానాలను గిల్ ఒక్కసారిగా పటాపంచలు చేశాడు.

మరోవైపు అక్షర్ పటేల్ (45) అద్భుతంగా రాణించాడు. గిల్​కు అక్షర్ చక్కటి సహకారం అందించడం వల్ల టీమ్ఇండియా స్కోర్ 200 దాటింది. ఇక షోయబ్ బషీర్ బౌలింగ్​లో గిల్, కీపర్ క్యాచ్​గా పెవిలియన్ చేరాడు. కొంత సేపటికే అక్షర్ కూడా ఔటయ్యాడు. సొంతగడ్డపై సత్తాచాటే ఛాన్స్ వచ్చినా భరత్ (6) మరోసారి ఫెయిలయ్యాడు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (29 పరుగులు) రాణించడం వల్ల భారత్ 250+ మార్క్ అందుకుంది.

భారత్ తొలి ఇన్నింగ్స్- 396/10

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్- 253/10

భారత్ రెండో ఇన్నింగ్స్- 255/10

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్- 67/1*

గిల్ బ్యాక్ టు ఫామ్- సూపర్ సెంచరీతో విమర్శలకు చెక్

'25 ఏళ్లు కూడా లేని కుర్రాళ్ల 'ఆట' అదుర్స్- క్రికెట్ ప్రపంచాన్ని శాసించేది వీరే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.