ETV Bharat / sports

'ఆ ఒక్క తప్పే జట్టు ఓటమికి కారణమైంది' - శుభ్‌మన్ గిల్ - GT VS PBKS IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 9:18 AM IST

GT VS PBKS IPL 2024
GT VS PBKS IPL 2024

GT VS PBKS IPL 2024 : శుభ్‌మన్ గిల్ తమ జట్టు గుజరాత్ టైటాన్స్ ఓడిపోవడానికి కారణం ఆ వ్యక్తి చెత్త ఫీల్డింగేనని తిట్టిపోశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌లు తలపడ్డాయి.

GT VS PBKS IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌లు ఉత్కంఠభరితంగా తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ చివరి వరకూ పోరాడి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాదాపు గుజరాత్ గెలుస్తుందనుకున్న తరుణంలో అశుతోష్ శర్మ గేమ్‌ను మలుపుతిప్పాడు. దీనిపై మ్యాచ్ అనంతరం గిల్ ఇలా మాట్లాడాడు.

"మేం ఓ రెండు క్యాచ్ లు వదిలేశాం. లేదంటే వాళ్లు గెలిచి ఉండాల్సింది కాదు. మా బౌలింగ్ బాగుంది. బంతి నేరుగా బ్యాట్ మీదకు వస్తుంటే డిఫెండ్ చేయడం చాలా కష్టం. కొత్త బంతితో కాస్త ఇబ్బందిపడ్డా. 200 పరుగుల లక్ష్యం కాపాడుకుంటే గెలిచేవాళ్లం. 15వ ఓవర్ వరకూ గేమ్ మా చేతిలోనే ఉంది. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు క్యాచ్‌లు వదిలేస్తారు. చివర్లో 7పరుగులు కావాల్సినప్పుడు నల్కండేతో బౌలింగ్ వేయించడం వెనుక ఎటువంటి వ్యూహం లేదు. అనామక ఆటగాళ్లు వచ్చి ఆడగలగడమే ఐపీఎల్ బ్యూటీ" అని తెలిపాడు.

క్యాచ్‌లు జారవిడిచిందిలా:
17వ ఓవర్ జరుగుతున్నప్పుడు, అప్పటికీ అశుతోష్ శర్మ 3 బంతులకు 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ సమయంలో ఉమేశ్ యాదవ్ క్యాచ్ మిస్ చేయడంతో 17 బంతులకు 31పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓవర్లో శర్మ ఆడిన బంతిని మరోసారి జారవిడవడంతో సాయి సుదర్శన్ ఇంకో అవకాశాన్ని చేజార్చుకునేలా చేశాడు.

ఈ క్యాచ్​లు పంజాబ్ జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీని అప్పజెప్పాయి. 13వో ఓవర్లో 5 వికెట్లు నష్టపోయి 111 పరుగులతో ఉన్న పంజాబ్‌ను శశాంక్ సింగ్ కాపాడాడు. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అలా 29 బంతుల్లో 61 పరుగులు బాదేసి ఒక బంతి మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలుపొందేందుకు కారణమయ్యాడు. అత్యుత్తమ పెర్ఫామెన్స్​కు గానూ శశాంక్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ వరించింది.

తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ 89 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్‌కు 199/4 స్కోరు సాధించేందుకు కీలకమయ్యాడు. అతనితో పాటు కేన్ విలియమ్సన్ (26), సాయి సుదర్శన్ (33), రాహుల్ తేవాటియా (33) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 6వ స్థానంలో ఉంటే, పంజాబ్ కింగ్స్ 5వస్థానంలో కొనసాగుతున్నాయి.

పంజాబ్​ అదుర్స్ - టైటాన్ ఖాతాలో మరో ఓటమి - GT vs PBKS IPL 2024

గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టిన సునీల్ - 7 ఫోర్లు 7 సిక్స్​లతో విశాఖలో వీరబాదుడు - IPL 2024 DC VS KKR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.