ETV Bharat / sports

గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టిన సునీల్ - 7 ఫోర్లు 7 సిక్స్​లతో విశాఖలో వీరబాదుడు - IPL 2024 DC VS KKR

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 7:37 AM IST

గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టిన సునీల్ - 7 ఫోర్లు 7 సిక్స్​లతో విశాఖలో వీరబాదుడు
గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టిన సునీల్ - 7 ఫోర్లు 7 సిక్స్​లతో విశాఖలో వీరబాదుడు

IPL 2024 Delhi Capitals VS Kolkata Knight Riders : తాజాగా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో సునీల్ నరైన్ ఊచకోత కోశాడు. 7 ఫోర్లు 7 సిక్స్​లతో విశాఖలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. పూర్తి వివరాలు స్టోరీలో

IPL 2024 Delhi Capitals VS Kolkata Knight Riders : సునీల్ నరైన్ ఒకప్పుడు లోయర్ ఆర్డర్ బ్యాటర్​. ఇప్పుడు ఓపెనర్‌గా దిగి సంచలనం సృష్టిస్తున్నాడు. ముందుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టి ప్రత్యర్థులకు అందనంత దూరంలో లక్ష్యాన్ని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. సరిగ్గా కోల్‌కతా వర్సెస్ దిల్లీ మ్యాచ్‌లోనూ ఇదే చేశాడు. ఓపెనర్‌గా దిగి 12.3 ఓవర్ల వరకూ ఆడిన నరైన్ 39 బంతుల్లో 85 పరుగులు (7 ఫోర్లు, 7 సిక్సులు) నమోదు చేశాడు. ఇషాంత్ శర్మ వేసిన 4వ ఓవర్లో అయితే ఏకంగా 6, 6, 4, 0, 6, 4 మొత్తంగా 26 పరుగులతో ఊచకోత కోశాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ సీజన్​లోని తమ ఆరంభ మ్యాచ్‌లో అతడు విఫలమైనప్పటికీ రెండో మ్యాచ్​ బెంగళూరు జట్టుపై 22 బంతుల్లో 47 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇప్పుడు దిల్లీని కూడా బెదరగొట్టి జట్టును గెలిపించాడు.

Delhi Capitals VS Sunil Narine : ఇకపోతే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న నరైన్​ సూపర్ ఫామ్‌కు గౌతం గంభీర్ కూడా కారణమనే చెప్పాలి. ఐపీఎల్ 2017లో గౌతం గంభీర్ కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో సునీల్ నరైన్‌ను ఓపెనర్ చేశాడు. అప్పట్లో క్రిస్ లిన్‌తో కలిసి అతడు కొన్ని మ్యాచ్‌లలో మెరుపు ఇన్నింగ్స్ కనబరిచాడు నరైన్. కానీ ఆ తర్వాతి సీజన్లలో గంభీర్ జట్టులో లేకపోవడంతో మళ్లీ లోయర్ ఆర్డర్​కు వెళ్లిపోయాడు నరైన్. ఇప్పుడు గంభీర్ అదే కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా రావడం నరైన్‌కు పగ్గాలు చేతికొచ్చినట్లు అయింది. ఓపెనర్​గా దిగి రెండు మ్యాచ్ లలోనూ అదరగొట్టేశాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే కోల్‌కతా నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ ఛేదించలేకపోయింది. పోరాడిన 106 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఈ విజయంలో సునీల్ నరైన్​ తమ ధనాధన్ ఇన్నింగ్స్​తో కీలకంగా వ్యవహరించాడు. కాగా, దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఇది మూడో పరాజయం. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి లేకుండా దూసుకుపోయింది.

విశాఖ మ్యాచ్​ - దిల్లీ క్యాపిటల్స్​పై కోల్​కతా భారీ విజయం - KKR VS DC IPL 2024

28 ఏళ్లకే రూ.100 కోట్ల డీల్- ప్రపంచంలోనే తొలి క్రికెటర్​గా రికార్డ్ - Rs 100 Crore Deal Cricketer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.