ETV Bharat / sports

RCB డెత్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్- 'దినేశ్ కార్తీక్' బెస్ట్ ఇన్నింగ్స్​ తెలుసా? - Dinesh Karthik Ipl Death Overs

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 7:27 PM IST

Dinesh Karthik IPL Death Overs: చాలా ఐపీఎల్‌ మ్యాచ్‌లలో చివరి బాల్‌ వరకు గెలుపు ఖరారు కాదు. కొన్నిసార్లు ఛేజింగ్ దాదాపు అసాధ్యం అనుకున్నప్పుడు పవర్‌ హిట్టింగ్‌తో కొందరు మ్యాచ్‌ గతినే మార్చేస్తుంటారు. అలాంటి బ్యాట్స్‌మెన్స్‌లో దినేష్‌ కార్తీక్‌ ఒకడు. ఈ స్టార్‌ వికెట్‌ కీపర్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఇవే.

Dinesh Karthik Ipl Death Overs
Dinesh Karthik Ipl Death Overs

Dinesh Karthik IPL Death Overs: 2024 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. బంతి బంతికి సమీకరణాలు మారిపోతున్నాయి. కొన్ని మ్యాచ్​లు నరాలు తెగే ఉత్కంఠను అందిస్తున్నాయి. మార్చి 25న సోమవారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ అలాంటిదే. చివరి వరకూ ఇరుజట్ల మధ్య దోబూచులాడిన విజయం ఆఖరికి ఆర్సీబీనే వరించింది.

అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కి హైలైట్‌గా నిలిచినా, వికెట్‌ కీపర్‌ దినేశ్​ కార్తీక్‌ ఇచ్చిన ఫినిషింగ్‌ అద్భుతం. డీకే ఇన్నింగ్స్​ను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. కోహ్లీ పెవిలియన్‌ చేరడం వల్ల మ్యాచ్‌ దాదాపు పంజాబ్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కి దిగిన కార్తీక్‌ వరుస బౌండరీలతో కావాల్సిన రన్​రేట్​ కరిగించేశాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతినే సిక్స్​గా మలిచి ఒత్తిడి తగ్గించేశాడు. దీంతో ఆర్సీబీ సీజన్​17లో తొలి విజయం నమోదు చేశాడు.

అయితే కొన్నేళ్లుగా ఐపీఎల్​లో దినేశ్ కార్తీక్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్​గా మారాడు. ఒత్తిడిని తట్టుకొని మ్యాచ్ ఫినిష్ చేయడంలో డీకే తనదైన మార్క్​ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే 17-20 డెత్ ఓవర్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడిగా, 2022లో డెత్ ఓవర్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కార్తీక్‌ రికార్డులు సృష్టించాడు. అయితే అన్ని మ్యాచ్‌లలో ఆర్సీబీ గెలవలేకపోయినా కార్తీక్‌ మాత్రం ఛేజింగ్‌లో తన హిట్టింగ్‌తో ప్రత్యర్థుల్లో కంగారు పుట్టించాడు. అలాంటి టాప్‌ ఫైవ్‌ ఇన్నింగ్స్‌లు ఇవే.

  1. సీఎస్కే వర్సెస్‌ ఆర్సీబీ (2015): ఐపీఎల్ 2015లో 37వ మ్యాచ్‌లో ఆర్సీబీ- చెన్నై తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 148 పరుగులు చేసింది. ఛేజింగ్‌కి దిగిన ఆర్సీబీ ప్రారంభంలోనే వికెట్‌ కోల్పోయింది. కోహ్లి, డివిలియర్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఆర్సీబీని పోటీలోకి తెచ్చినా 21 పరుగులకు డివిలియర్స్‌ వెనుదిరిగాడు. వరుసగా వికెట్లు కోల్పోయి ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు దినేష్‌ కార్తీక్‌ క్రీజులోకి వచ్చాడు. 23 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ చివరి వరకు కార్తీక్‌ ఉంటే ఆర్సీబీ గెలిచేస్తుందని అందరూ భావించారు. కానీ నెహ్రా బౌలింగ్‌లో కార్తీక్‌ అవుట్‌ అయిపోయాడు. ఆర్సీబీ 124 రన్స్‌కి ఆలౌట్‌ అయింది.
  2. సీఎస్కే వర్సెస్‌ ఆర్సీబీ (2022): సీజన్‌ 22వ మ్యాచ్‌లో చెన్నై ఆర్సీబీకి 217 పరుగుల భారీ టార్గెట్‌ని సెట్‌ చేసింది. ఛేజింగ్‌కి దిగిన ఆర్సీబీ వరుసగా డుప్లెసిస్‌, అనూజ్‌ రావత్‌, కోహ్లి వికెట్లు కోల్పోయింది. ముగ్గురి స్కోర్‌ కలిపి 21 దాటలేదు. చివరిలో బ్యాటింగ్‌కి వచ్చిన దినేష్‌ కార్తీక్‌ 14 బంతులకు 34 పరుగులు చేశాడు. ఇదే ఊపులో కార్తీక్‌ ఆడితే చెన్నైకి ఓటమి తప్పదనుకున్నారు. కానీ కార్తీక్‌ శ్రమ వృథా అయింది. ఆర్సీబీ 193 పరుగులకు పరిమితం అయింది.
  3. ఆర్సీబీ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ (2022): 170 టార్గెట్‌ని ఛేజ్ చేయడానికి దిగిన ఆర్సీబీ 62 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. టాప్‌ ఆర్డర్ అంతా పెవిలియన్‌ చేరిపోయింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కి వచ్చిన కార్తీక్‌ 23 బంతులకు 44 పరుగులు చేసి ఆర్సీబీకి విజయం అందించాడు.
  4. సీఎస్కే వర్సెస్‌ ఆర్సీబీ (2023): 2023 ఐపీఎల్ 24వ మ్యాచ్‌ చెన్నై- బెంగళూరు మధ్య జరిగింది. చెన్నై 226 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఛేజింగ్‌ ప్రారంభించిన ఆర్సీబీకి మొదట్లోనే షాక్‌ తగిలింది. కోహ్లీ 6 పరుగులకే ఔట్‌ అయ్యాడు. డివిలియర్స్‌ 62, మ్యాక్స్‌వెల్‌ 76 పరుగులు చేసి ఔట్‌ అయ్యారు. కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో వచ్చిన కార్తీక్‌ కేవలం 14 బంతులకు 28 పరుగులు చేసి ఆర్సీబీ శిబిరంలో ఆశలు పెంచాడు. కానీ చివరికి ఆర్సీబీ 218 పరుగులకు ఆలౌట్‌ అయింది.
  5. ఆర్సీబీ వర్సెస్‌ పంజాబ్‌ (2024): రీసెంట్​ మ్యాచ్‌లో కార్తీక్‌ విజయానికి ప్రతిఫలం దక్కింది. సీజన్‌లో ఆర్సీబీ మొదటి గెలుపు అందుకుంది. కేవలం 10 బాల్స్‌లో 28 పరుగులతో కార్తీక్‌ చెలరేగాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయంటే దినేష్‌ కార్తీక్‌ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 19.2 ఓవర్లకే ఆర్సీబీ 177 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.

పంజాబ్​తో మ్యాచ్​ - అది నన్ను ఎంతో బాధించింది : కోహ్లీ - IPL 2024 PBKS VS RCB

కింగ్ దంచేశాడు - విజయం బెంగళూరుదే - RCB Vs PBKS IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.