ETV Bharat / sports

కింగ్ దంచేశాడు - విజయం బెంగళూరుదే - RCB Vs PBKS IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 11:00 PM IST

Updated : Mar 26, 2024, 6:23 AM IST

RCB Vs PBKS IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన ఆసక్తికర మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిచింది. కింగ్ కోహ్లీ అదరగొట్టేశాడు. చిన్నస్వామి స్టేడియంలో కళ్లు చెదిరే షాట్లతో ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా, తన బ్యాటింగ్‌తో జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. ఇక చివర్లో ఒత్తిడిలోనూ దినేశ్‌ కార్తీక్‌, లొమ్రార్‌ తమ అదిరే ఆటతో జట్టుకు విజయాన్ని అందించారు. పూర్తి మ్యాచ్ వివరాలు స్టోరిలోకి వెళ్లి తెలుసుకోండి.

RCB Vs PBKS IPL 2024
RCB Vs PBKS IPL 2024

RCB Vs PBKS IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్​ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ పోరులో గెలిచి 2024 సీజన్​లో తొలి విజయం సాధించింది ఆర్సీబీ. విరాట్‌ కోహ్లి (49 బంతుల్లో 11×4, 2×6 సాయంతో 77 పరుగులు) అద్భుతంగా రాణించడంతో ఆసక్తికరంగా సాగిందీ మ్యాచ్. ఫలితంగా ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్‌ 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. తొలి బాల్​ నుంచే ఆచీతూచీ ఆడింది. ప్రత్యర్థులు వేసిన బంతులను చాకచక్యంగా ఎదుర్కొని మంచి స్కోర్ చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (37 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 45 పరుగులు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జితేశ్‌ శర్మ (20 బంతుల్లో 1×4, 2×6 సాయంతో 27 పరుగులు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (17 బంతుల్లో 2×4, 2×6 సాయంతో 25 పరుగులు), సామ్‌ కరన్‌ (17 బంతుల్లో 3×4 సాయంతో 23 పరుగులు) చేశారు. చివరి ఓవర్​లో వచ్చిన శశాంక్‌ సింగ్ (21) కూడా కీలక ఇన్నింగ్స్ అందించాడు. సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌ తలో రెండు వికెట్లు తీశారు. అల్జారీ జోసెఫ్‌,యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇక 177 పరుగుల ఛేధనలో కోహ్లీ చేసిన స్కోరును సద్వినియోగం చేస్తూ చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (10 బంతుల్లో 3×4, 2×6 సాయంతో 28 నాటౌట్‌), లొమ్రార్‌ (8 బంతుల్లో 2×4, 1×6 సాయంతో 17 నాటౌట్‌) మంచిగా రాణించడం వల్ల ఆర్సీబీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (2/13), రబాడ (2/23) అద్భుతంగా బౌలింగ్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్ష్‌దీప్‌ (3.2 ఓవర్లలో 40), హర్షల్‌ పటేల్‌ (1/45) ధారాళంగా పరుగులిచ్చేశారు.

బెంగళూరు తుది జట్టు :
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్‌), అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

పంజాబ్ తుది జట్టు :
శిఖర్ ధావన్ (కెప్టెన్‌), కగిసో రబాడ, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరన్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్.

ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఔట్ - ఫైనల్​ మ్యాచ్ చెన్నైలోనే - IPL 2024 Schedule

స్టేడియంలో దారుణంగా కొట్టుకున్న రోహిత్ - హార్దిక్ ఫ్యాన్స్ - వీడియో వైరల్ - IPL 2024 MI VS GT

Last Updated : Mar 26, 2024, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.