ETV Bharat / sports

ధోనీ కోసం స్టేడియానికి- రూ.64వేలు పెట్టి బ్లాక్​లో టికెట్ కొనుగోలు- కూతురి ఫీజు కట్టకుండా! - Dhoni Fan Ipl Ticket

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 4:43 PM IST

Dhoni Fan IPL Ticket
Dhoni Fan IPL Ticket

Dhoni Fan IPL Ticket: ధోనీ పేరు చెప్పగానే ఫ్యాన్స్​కు పూనకాలే. మిస్టర్ కూల్​గా పేరొందిన ధోనీకి భారీగా అభిమానులు ఉన్నారు. అతడి బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు ఎంత డబ్బులైనా పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్​కు టికెట్లు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఓ అభిమాని ధోనీ కోసం పిల్లల ఫీజులను కట్టలేదు. ఆ డబ్బులను మ్యాచ్ టికెట్ల కోసం వినియోగించాడు. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Dhoni Fan IPL Ticket: 'మహేంద్రసింగ్' ధోనీ ఈ పేరు చెప్పగానే అతడి ఫ్యాన్స్ ఊగిపోతారు. జీవితంలో ఒక్కసారైనా ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా చూడాలని ఆశపడుతుంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-17 సీజన్​ ధోనీకి ఆఖరి ఐపీఎల్​ అని ప్రచారం సాగుతన్న నేపథ్యంలో అతడి కోసం ఫ్యాన్స్​ స్టేడియాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా చెన్నై సొంత మైదానం చెపాక్​లో మ్యాచ్​ జరిగితే ఎలాగైనా ధోనీని చూసేందుకు అక్కడి ఫ్యాన్స్​ పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు.

దీంతో చెన్నై మ్యాచ్​కు ఈజీగా టికెట్లు దొరకడం లేదని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ధోనీని చూసేందుకు ఓ అభిమాని రూ.64000 పెట్టి మరి బ్లాక్​లో టికెట్లు కొన్నాడు. తనతో పాటు ముగ్గురు కుమార్తెలను స్టేడియానికి తీసుకొచ్చాడు. అది కూడా తన కూతురు స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బుతో ఈ టికెట్లు కొన్నట్లు సదరు అభిమాని తెలిపాడు. సీఎస్కే- కేకేఆర్ మధ్య ఏప్రిల్ 8న మ్యాచ్ చెన్నై చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగింది. అయితే ఓ ధోనీ అభిమాని ఈ మ్యాచ్ ను చూసేందుకు తన ముగ్గురు కుమార్తెలతో స్టేడియానికి వచ్చాడు. తనకు మ్యాచ్ చూసేందుకు మొదట టిక్కెట్లు లభించలేదని, అందుకే టికెట్లను బ్లాక్ లో రూ. 64,000కు కొన్నానని చెప్పాడు. ఈ క్రమంలో తన ముగ్గురు కుమార్తెల స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదని వెల్లడించాడు.

'చెన్నై, కేకేఆర్ మ్యాచ్ చూసేందుకు నాకు టిక్కెట్లు దొరకలేదు. అందుకే టికెట్లను రూ.64 వేలు ఖర్చు చేసి బ్లాక్‌లో కొన్నాను. అయితే నా కుమార్తెల స్కూల్ ఫీజు ఇంకా చెల్లించలేదు. మ్యాచ్ టికెట్ల కొనుగోలు కోసం నా కుమార్తెల స్కూల్ ఫీజు కట్టలేదు. కానీ ధోనిని ఒక్కసారైనా చూడాలనుకున్నాం. నా కుమార్తెలు, నేను మహీని చూశాం. చాలా సంతోషంగా ఉంది.' అని ధోనీ అభిమాని చెప్పుకొచ్చారు. ' మా నాన్న చెన్నై- కేకేఆర్ మ్యాచ్ టికెట్ల కోసం చాలా కష్టపడ్డారు. ధోనీని స్టేడియంలో చూసి చాలా సంతోషపడ్డాం.' అని ధోని అభిమాని చిన్న కుమార్తె చెప్పింది.

అయితే కుమార్తెల ఫీజు కట్టకుండా మ్యాచ్ చూసేందుకు బ్లాక్ టికెట్లు కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మూర్ఖత్వం అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పిల్లల చదువు కంటే మ్యాచ్ విలువైనది కాదని మరికొందరు పోస్ట్ లు పెడుతున్నారు. మరికొందరు కుమార్తెల సంతోషం కోసం ఏదైనా చేయొచ్చని అంటున్నారు.

'ఏంటి జడ్డూ ఇలా చేశావ్​' - ధోనీ ఫ్యాన్స్​ను ఆటపట్టించిన ఆల్​రౌండర్! - Ravindra Jadeja CSK

'నాది త్యాగం కాదు, ప్రేమ'- ధోనీ రిటైర్మెంట్​పై సాక్షి కామెంట్స్ - Dhoni Test Cricket Retirement

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.