ETV Bharat / sports

హైదరాబాద్ మొత్తం ధోని మేనియా - సన్​రైజర్స్ మళ్లీ సత్తా చాటేనా ? - CSK VS SRH IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 12:03 PM IST

CSK VS SRH IPL 2024 : ఐపీఎల్​ సీజన్ 17లో భాగంగా నేడు ( ఏప్రిల్ 5న) చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్​లోని ఉప్పల్​ వేదికగా ప్రారంభం కానున్న ఈ పోరు గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం

CSK VS SRH IPL 2024
CSK VS SRH IPL 2024

CSK VS SRH IPL 2024 : హైదరాబాద్‌లో హీట్ పెరిగింది. అది సమ్మర్ హీట్ మాత్రమే కాదు ధోనీ ఆడుతున్న మ్యాచ్ క్రేజ్ కూడా. ఐపీఎల్ సీజన్‌లో భాగంగా కొద్ది రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ వర్మ, తిలక్ వర్మలు ముంబయి ఇండియన్స్‌పై అత్యుత్తమ ఫామ్​ కనబరిచారు. ఆ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ 277 అత్యధిక స్కోరు నమోదు చేసింది.

శుక్రవారం జరిగే మ్యాచ్‌లోనూ హైదరాబాద్ నుంచి అదే తరహా పెర్‌ఫార్మెన్స్ ఆశిస్తున్నా, ప్రత్యర్థి జట్టు పైనే ఫోకస్‌డ్‌గా ఉన్నారు హైదరాబాదీలు. చెన్నై సూపర్ కింగ్స్​తో తలపడుతున్న మ్యాచ్ కావడం వల్ల కచ్చితంగా 200కి పైగా స్కోరు చేస్తేనే గెలుస్తామని, అదే తరహా ప్రిపరేషన్ లో ఉన్నామని ఎస్సార్హెచ్ కోచ్ డేనియల్ వెట్టోరి వెల్లడించారు.

ఇదిలా ఉంటే, సిటీ మొత్తం ధోనీ మానియానే నడుస్తుంది. ధోనీ ఆడే చివరి లీగ్ అని ప్రచారం జరగడంతో ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఇదంతా క్యాష్ చేసుకునేందుకు ఫేక్ టికెట్స్ సర్క్యూలేట్ చేస్తున్నారంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ కొనుగోలుదారులకు వార్నింగ్ ఇచ్చింది. స్టేడియంలో టిక్కెట్లు ఎక్కువ శాతం వరకూ ఆన్‌లైన్‌లో ఉంచలేదని, వాటిని కాంప్లిమెంటరీ టిక్కెట్ల రూపంలో అమ్మాలని చూస్తున్నట్లు కూడా మేనేజ్​మెంట్​ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

40 వేల సామర్థ్యమున్న స్టేడియం టిక్కెట్లు గంటలోనే అమ్ముడైనట్లు ఆన్‌లైన్ సంస్థ ఫ్రాంచైజీ చెప్తున్నాయి. మ్యాచ్ కోసం ఎన్ని టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంచారని, ఎంతవరకు కొనుగోలు జరిగాయనేది సన్‌రైజర్స్, హెచ్‌సీఏకు మాత్రమే తెలుసు. ఈ బ్లాక్ టికెట్లు, ఫేక్ టిక్కెట్ల మోసం తగ్గాలంటే ఈ సమాచారం అధికారికంగా ప్రకటించడం ఉత్తమమైన పని.

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే చెన్నై సూపర్ కింగ్స్​, సన్​రైజర్స్​ మ్యాచ్‌లో ధోనీ మరోసారి వైజాగ్ ఆటను కనబరుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 37 పరుగులు చేయడంతో వింటేజ్ ధోనీ కనిపించాడు. పాత స్టైల్‌లో సేమ్ అదే లాంగ్ హెయిర్‌తో 42 ఏళ్ల వయస్సులోనూ నాలుగు ఫోర్లు, మూడు సిక్సులతో ఆశ్చర్యపరిచాడు. ఈ సీజన్ తొలి రెండు గేమ్‌లలో బ్యాటింగ్ చేయని ధోనీ దిల్లీతో మ్యాచ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెనుదిరగడంతో బ్యాటింగ్‌కు దిగాడు.

పంజాబ్​ అదుర్స్ - టైటాన్ ఖాతాలో మరో ఓటమి - GT vs PBKS IPL 2024

IPLలో ఫారిన్ ప్లేయర్ల హవా- వీళ్లు క్రీజులోకొస్తే పరుగుల వర్షమే - Overseas Player Most IPL Runs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.