ETV Bharat / sports

IPL​లో ధోనీ బెస్ట్ మూమెంట్స్- ధనాధన్ బ్యాటింగ్​తో ఫ్యాన్స్​ ఖుష్- వీడియోలు చూశారా? - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 12:24 PM IST

Dhoni Ipl 2024: SummarY: 42 ఏళ్ల వయస్సులోనూ ఫుల్ ఫిట్‌నెస్​తో ధోనీ వికెట్ కీపింగ్​తోపాటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. 2024 ఐపీఎల్​లో ధోనీ బెస్ట్ మూమెంట్స్​ చూశారా?

Dhoni Ipl 2024
Dhoni Ipl 2024 (Source: Associated Press)

Dhoni Ipl 2024: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్​ నిరాశపరిచింది. టోర్నమెంట్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఓడిపోయి ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పైచేయి సాధించలేకపోయింది. గతేడాది టైటిల్ దక్కించుకున్న జట్టు ప్రస్తుత సీజన్లో లీగ్ దశలోనే వెనుదిరగడం విచారకరం. దశాబ్దానికిపైగా చెన్నైకి కెప్టెన్​గా వ్యవహరించిన ధోనీ ఈ సీజన్​లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్​కు సారధ్య బాధ్యతలు అప్పగించారు.

ప్రస్తుత సీజన్లో చెన్నై ఆడింది 14 మ్యాచ్​లు అయితే అందులో గెలిచింది 7 మాత్రమే. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ధోనీ ఫామ్ చెన్నై అభిమానుల్లో ఏ మాత్రం నిరాశను కనబరచలేదు. 42 ఏళ్ల వయస్సులోనూ ఫుల్ ఫిట్‌నెస్ కనబరిచిన ధోనీ వికెట్ కీపింగ్​తోపాటు బ్యాటింగ్​లోనూ అదరగొట్టాడు. దీంతో ధోనీ ఫిట్‌నెస్ చూస్తుంటే రాబోయే ఏడాది కూడా చెన్నై జట్టులో ప్లేయర్​గా కొనసాగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఈ సీజన్​లో తన మ్యాజిక్‌తో ఫ్యాన్స్​ను ఆకట్టుకున్నాడిలా

చెన్నై- ముంబయి: ముంబయితో మ్యాచ్​లో రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఈ మ్యాచ్​లో ఆఖరి ఓవర్లో ధోనీ బ్యాటింగ్​తో స్టేడియంలో ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించాడు. హార్దిక్ పాండ్య బౌలింగ్​లో చివరి నాలుగు బంతుల్లో వరుసగా మూడు సిక్సులు సహా 20 పరుగులు పిండుకున్నాడు. ఇక ఈ మ్యాచ్​లో చెన్నై 20 పరుగుల తేడాతో నెగ్గడం విశేషం.

చెన్నై- గుజరాత్: గుజరాత్​తో మ్యాచ్​లో చెన్నై 63 పరుగులతో నెగ్గింది. ఈ మ్యాచ్​లో ధోనీ మెరుపు వికెట్ కీపింగ్​ చూసి అంతా స్టన్ అయిపోయారు. స్టంప్స్ వెనుక చురుగ్గా కదిలి డైవ్​ చేసి క్యాచ్ అందుకున్నాడు. వెనుక వైపుగా బౌండరీకి బౌండరీకి చేరుకుంటుందని భావించిన విజయ్ శంకర్​కు ధోనీ షాక్ ఇచ్చాడు.

చెన్నై- బెంగళూరు: జట్టు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒత్తిడిని తట్టుకుంటూ 110 మీటర్ల సిక్సు బాదాడు ధోనీ. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. అప్పుడు సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది. కానీ, తర్వాత బంతికే ధోనీ ఔటయ్యాడు. దీంతో సీఎస్కే ఆశలు అక్కడితో ఆగిపోయాయి.

'మాకైతే ఏం చెప్పలేదు'- ధోనీ రిటైర్మెంట్​పై చెన్నై మేనేజ్​మెంట్ - IPL 2024

'ఆ మాట చాలా క్రేజీగా ఉంది - ధోనీకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు' - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.