ETV Bharat / sports

'గబ్బా'లో విండీస్ నయా హిస్టరీ- ఆసీస్​ గడ్డపై 27 ఏళ్ల తర్వాత విక్టరీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 1:06 PM IST

Updated : Jan 28, 2024, 2:27 PM IST

Aus vs Wi 2nd Test: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్​లో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ను విండీస్ 1-1తో డ్రా చేసుకుంది.

Aus vs Wi 2nd Test
Aus vs Wi 2nd Test

Aus vs Wi 2nd Test: ఆస్ట్రేలియా పర్యటనలో వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. ఆసీస్ కంచుకోట గబ్బా మైదానంలో జరిగిన రెండో టెస్టులో విండీస్ 8 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో వెస్టిండీస్ 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది. విండీస్ పేసర్ షామర్ జోసెఫ్ 7 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి, ​తమ జట్టుకు టెస్టుల్లో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్ 1-1తో డ్రా గా ముగిసింది.

215 టార్గెట్​తో బరిలోకి దిగిన ఆసీస్ క్రమంగా వికెట్లో కోల్పోయింది. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 పరుగులు) ఒక్కడే పోరాడాడు. అతడికి కామెరూన్ గ్రీన్ (42 పరుగులు) మాత్రమే సహకారం అందించాడు. ఉస్మాన్ ఖవాజా (10), మార్నస్ లబుషేన్ (5), మిచెల్ మార్ష్ (10), అలెక్స్ కేరీ (2) విఫలమయ్యారు. స్టార్ ఆల్​రౌండర్ ట్రావిస్ హెడ్ రెండు ఇన్నింగ్స్​ల్లోనూ డకౌట్​గా వెనుదిరగడం విశేషం.

గబ్బాలో ఆసీస్ రికార్డ్: బ్రిస్బేన్ గబ్బా మైదానంలో ఆసీస్​కు ఘనమైన రికార్డ్ ఉంది. టెస్టుల్లో గబ్బా మైదానం ఆసీస్​కు కంచుకోట లాంటింది. అలాంటి గబ్బాలో గ్రౌండ్​లో ఆసీస్ చివరిసారిగా 2021 జనవరిలో భారత్​పై ఓడగా, తాజాగా విండీస్​ చేతిలో భంగపడింది.

డే అండ్ నైట్ టెస్టులో తొలి ఓటమి: పింక్ బాల్​ (డే అండ్ నైట్ టెస్టు) మ్యాచ్​లో ఆసీస్ తొలిసారి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్​కు ముందు ఆసీస్ 11 సార్లు పింక్​బాల్ టెస్టుల్లో ఆడితే, అన్నింట్లోనూ విజయం సాధించింది.

షామర్ జోసేఫ్ అదుర్స్: ఈ మ్యాచ్​ మూడో రోజు షమర్ జోసేఫ్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతి నేరుగా జోసేఫ్ కాలికి బలంగా తగిలింది. దీంతో జోసేఫ్ నొప్పితో తీవ్రంగా బాధపడుతూ క్రీజును (రిటైర్డ్ ఔట్) వదిలాడు. ఇక వేగంగా కోలుకున్న జోసేఫ్, ఈరోజు (నాలుగో రోజు) సుమారూ 150kmph స్పీడ్​తో బౌలింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 7 వికెట్లు నేలకూల్చి విండీస్​కు చిరస్మరణీయ విజయం అందించాడు.

  • వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311-10
  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 289-9 D (డిక్లేర్డ్)
  • వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్​: 193
  • ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్​: 207-10

డేవిడ్ వార్నర్​కు రీప్లేస్​మెంట్​ - ఓపెనర్​గా స్టీవ్​ స్మిత్​

చారిత్రక విజయానికి మూడేళ్లు- 'గబ్బా' విక్టరీపై బీసీసీఐ స్పెషల్ ట్వీట్

Last Updated : Jan 28, 2024, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.