ETV Bharat / sports

ఆసీస్ x కివీస్: విలియమ్సన్ 12ఏళ్లలో తొలిసారి అలా

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 11:22 AM IST

Updated : Mar 1, 2024, 12:48 PM IST

Aus vs Nz Test 2024: ఆస్ట్రేలియా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్- కివీస్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. గత కొన్నిరోజులుగా టెస్టుల్లో పలు రికార్డులు సృష్టిస్తున్న విలియమ్సన్ ఈ ఇన్నింగ్స్​లో ఆకట్టుకోలేకపోయాడు.

Aus vs Nz Test 2024
Aus vs Nz Test 2024

Aus vs Nz Test 2024: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో ఆడుతున్నాడు. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 29న ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం టెస్టు క్రికెట్​లో అత్యుత్తమ ఫామ్​లో ఉన్న విలియమ్సన్ ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్​గా పెవిలియన్ చేరాడు. అయితే గత 12ఏళ్లలో విలియమ్సన్​ టెస్టుల్లో రనౌట్ అవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. అతడు 2012జనవరలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో టెస్టుల్లో చివరిసారిగా రనౌట్ అయ్యాడు.

ఇన్నింగ్స్​ ఆరో ఓవర్లో ఆసీస్ పేసర్ వేసిన బంతిని విలియమ్సన్ స్ట్రయిట్​ డ్రైవ్ ఆడాడు. వెంటనే పరుగు కోసం విలియమ్సన్ క్రీజను వదిలి ముందుకు పరిగెత్తాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రైక్​ ఎండ్​లో ఉన్న విల్​ యంగ్- విలియమ్సన్ ఢీకొట్టాడు. ఇంతలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న లబూషేన్ చురుగ్గా స్పందించి బంతిని స్టంప్స్​ వైపు విసిరాడు. అంతే విలియమ్సన్ పరుగు పూర్తి చేయకముందే బంతి స్టంప్స్​ను తాకింది. దీంతో అతడు పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఇక గత ఏడు టెస్టుల్లో ఏడు సెంచరీలు బాదిన విలియమ్సన్ ఈ ఇన్నింగ్స్​లో డకౌట్ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్​లో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా రెండో ఇన్నింగ్స్​లో డకౌట్ అయ్యాడు. ఒకే టెస్టు మ్యాచ్​లో వేర్వేరు జట్లలోని దిగ్గజ ఆటగాళ్లు డకౌట్ అవ్వడం చాలా అరుదు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్ 383 పరుగులకు ఆలౌటైంది. యంగ్ ఆల్​రౌండర్ కామెరూన్ గ్రీన్ (174 పరుగులు; 23x4, 5x6) ఒక్కడే భారీ ఇన్నింగ్స్​తో చెలరేగాడు. దీంతో ఆసీస్ ఆ స్కోర్ సాధించగలిగింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్ల పడగొట్టి ఆసీస్​ పతనాన్ని శాసించాడు. ఇక తొలి ఇన్నింగ్స్​లో కివీస్ 179 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది. విలియమ్సన్​తో పాటు యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

కేన్​ మామ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్​ - ఫొటో చూశారా ?

టెస్టుల్లో కేన్ దూకుడు - రెండు ఇన్నింగ్స్​లో మూడు రికార్డులు

Last Updated : Mar 1, 2024, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.