ETV Bharat / spiritual

వాస్తు ప్రకారం ఇంటికి ఈ కలర్స్ వేశారంటే - మీరు పట్టిందల్లా బంగారం కావాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 3:54 PM IST

House Colour Vastu Tips : చాలా మంది సాధారణంగా ఇంటి నిర్మాణం పూర్తి కాగానే తమకు నచ్చిన కలర్స్​ను వేయిస్తుంటారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటికి వేయాల్సిన కలర్స్ కొన్ని ఉన్నాయని తెలుసా? వాటిని పేయింట్ వేయించడం ద్వారా ఇంట్లో పాజిటివిటీ పెరగడంతో పాటు ఆరోగ్యం, కేరీర్ బావుంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

House Colours
Vastu

Vastu Tips for Home Colours : ప్రస్తుత రోజుల్లో మనలో చాలా మంది ఏ నిర్మాణం చేపట్టినా కచ్చితంగా వాస్తు నియమాలను ఫాలో అవుతుంటారు. ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో వస్తువులు సర్దుకునే వరకు ప్రతీ విషయంలో వాస్తును చూస్తుంటారు. చివరికి ఇంట్లోని గోడలకు వేసే రంగులూ వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం(Vastu Shastra) ప్రకారం.. ఇంట్లోని ప్రతి దిశకు ఒక నిర్దిష్ట శక్తి ఉంటుంది. రంగులు అనేవి ఆ శక్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాస్తు ప్రకారం ఇంట్లోని గోడలకు వేయాల్సిన రంగులు కొన్ని ఉన్నాయి. సరైన కలర్స్ ఎంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరగడమే కాకుండా ఆరోగ్యం, కేరీర్ బావుంటుందని, ప్రశాంతత నెలకొంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వాస్తుప్రకారం ఏ వైపు గోడకు ఏ రంగు వేయాలంటే..

  • ఇంటి ఉత్తర భాగం నీటికి సంబంధించినది. కాబట్టి ఆ దిశగా ఉన్న గోడలపై పిస్తా, ఆకుపచ్చ రంగులు వేయడం మంచిది అంటున్నారు వాస్తు నిపుణులు. ఈ కలర్స్ వేయడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా ఇక్కడ స్కై బ్లూ కలర్ కూడా మంచిదే అంటున్నారు.
  • ఇంట్లోని పడమర వైపు గోడకు లేదా గదులకు నీలం రంగు సరైనదని వాస్తు నిపుణులు చెబుతారు. అలాగే ముదురు నీలం రంగుకు బదులుగా, కొద్దిగా తెలుపు మిక్స్ చేసి వేయడం మంచిది అంటున్నారు. వాస్తు ప్రకారం పశ్చిమాన్ని చూసే ఏ గోడకైనా నీలం రంగు వేసుకోవచ్చని చెబుతున్నారు.
  • ఇక ఇంటికి ఆగ్నేయ దిశకు వస్తే.. ఇది అగ్నికి సంబంధించిన దిశ కాబట్టి ఆగ్నేయ దిక్కులో ఉన్న గోడలకు నారింజ, గులాబీ, పసుపు రంగులు వేయడం శుభప్రదమని చెబుతున్నారు వాస్తు పండితులు.
  • ఇంటి దక్షిణం వైపు ఆరెంజ్ కలర్, గులాబీ రంగు వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వంటగది, డైనింగ్‌ హాల్‌ గోడలకు ఈ రంగులు వేయడం ఉత్తమం అని చెబుతున్నారు.
  • ఇంట్లో అన్ని గదుల పై కప్పులకు తెలుపు రంగు వేయడమే ఉత్తమం అంటున్నారు. ఎందుకంటే ఇది పాజిటివ్ ఎనర్జీకి సంకేతం. అలాగే రూమ్​ టెంపరేచర్​ను తగ్గిస్తుంది.
  • దేవుడి రూమ్​లో తెలుపు, లేత పసుపు, నారింజ, స్కై బ్లూ, గులాబీ వంటి రంగులు వేసుకోవడం మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇలా వేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. అలాగే స్టడీ రూమ్​కు పసుపు రంగు వేసుకోవడం మంచిదట. ఎందుకంటే ఈ కలర్ మనోల్లాసానికి, విజ్ఞతకు సూచిక.
  • ఇక బెడ్‌ రూమ్‌ విషయానికొస్తే స్కై బ్లూ, గులాబీ రంగు వంటి కలర్స్ వేసుకుంటే మంచిదంటున్నారు వాస్తు పండితులు. ఎందుకంటే ఇవి మనసుకి మంచి ప్రశాంతతని ఇవ్వడమే కాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్​ని పొందేలా చేస్తాయంట.

మీ బాత్‌రూమ్‌ ఇలా ఉంటే - వాస్తు దోషం చుట్టుముడుతుంది!

ఇంటికి రంగులు వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరికొన్ని వాస్తు టిప్స్ :

  • ఇంట్లో ఏ దిక్కున 'వాస్తు దోషం' ఉందో ఆ గదిలో ఉండే వారి రాశి చక్రం ప్రకారం ఆ దిశ గోడకు రంగు వేసుకుంటే మేలు జరుగుతుందంటున్నారు వాస్తు పండితులు.
  • ఇంటి యజమాని జాతకాన్ని బట్టి నివాసం బయట రంగు వేయమని సూచిస్తున్నారు. జాతక ప్రకారం తగిన రంగును వేయడం వల్ల ఇంటి వాస్తు సమస్యలు తొలగిపోతాయి.
  • వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి బయట రంగు దాని ఎదురుగా ఉన్న దిశను పరిశీలించి తగిన కలర్​ను పెయింట్ వేయడం చాలా అవసరం.

కొత్తగా పెళ్లైన వారు బెడ్​రూమ్ ఇలా సెట్ చేసుకున్నారంటే - బంధం బలపడడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.