ETV Bharat / spiritual

కొత్తగా పెళ్లైన వారు బెడ్​రూమ్ ఇలా సెట్ చేసుకున్నారంటే - బంధం బలపడడం ఖాయం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 4:23 PM IST

Vastu Tips for Bedroom : కొత్తగా పెళ్లైన వారు బెడ్​రూమ్​లో వాస్తుదోషాలు లేకుండా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు వాస్తు నిపుణులు. ముఖ్యంగా పడకగదిని వాస్తుప్రకారం అలంకరించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే దంపతుల మధ్య గొడవలు తలెత్తి బంధానికి బీటలు వారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ వాస్తుప్రకారం బెడ్​రూమ్ ఎలా డెకరేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Bedroom
Vastu Tips for Bedroom

Vastu Tips for Newly Wed Couple Bedroom : ప్రస్తుతం మాఘ మాసం స్టార్ట్ కావడంతో పెళ్లిళ్లు ఊపందుకోనున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లైన జంట తమ బెడ్​రూమ్​లో వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్త పడాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. నూతన వధువరులు కొత్త జీవితాన్ని కలిసి ప్రారంభించేముందు పడకగదిని వాస్తుకు అనుగుణంగా డెకరేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే బెడ్​రూమ్​(Bedroom)లోని వస్తువులన్నీ వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. అలా ఉండడం వల్ల దంపతుల బంధం మరింత బలపడడమే కాకుండా జీవితం సుఖసంతోషాలతో నిండి ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ, వాస్తుప్రకారం కొత్తగా పెళ్లైన వారు బెడ్​రూమ్​ను ఎలా అలంకరించుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బెడ్​రూమ్ డైరెక్షన్ : వాస్తుప్రకారం.. కొత్తగా పెళ్లైన వారి బెడ్​రూమ్ ఆగ్నేయ దిశలో ఉండాలి. అది భవనంలో పై అంతస్తులో ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ అలా లేకపోతే నూతన దంపతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితులలో వధువు తల గది దక్షిణ దిశకు.. పాదాలు ఉత్తర దిశకు ఎదురుగా ఉండేలా బెడ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. పెళ్లికూతురు పాదాలు బెడ్​రూమ్ ఎంట్రన్స్ లేదా గది తలుపు వైపు ఉండకుండా చూసుకోవాలి. ఇదీ సాధ్యం కాకపోతే వధువు తల తూర్పు దిశకు ఎదరుగా ఉండేలా మంచాన్ని సెట్ చేసువాలి. అయితే గర్భం దాల్చాల్సి వచ్చినప్పుడు స్లీపింగ్ పొజిషన్ మార్చుకోవాల్సి ఉంటుందని మీరు గమనించాలి.

మంచం ఎలా ఉండాలి?

వాస్తుప్రకారం.. బెడ్​రూమ్​లో చెక్క మంచాన్ని ఏర్పాటుచేసుకోవడం మంచిది. ఎందుకంటే మెటల్​తో తయారు చేసిన మంచం కోల్డ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. అదే చెక్కతో తయారుచేసినదానికి వార్మ్ ఎనర్జీ ఉంటుంది. కొత్తగా పెళ్లైన వారికి వార్మ్ ఎనర్జీ అవసరం కాబట్టి చెక్క మంచం ఉండేలా చూసుకోవాలంటున్నారు వాస్తు నిపుణులు. అదేవిధంగా మంచానికి బాక్స్ ఉన్నట్లయితే అందులో వ్యర్థాలను డంప్ చేయకూడదు. పదునైన వస్తువులను అందులో ఉంచకూడదు. ఇవి మాత్రమే కాదు పరుపు కూడా సింగిల్ ఉండాలనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.

అద్దం ఎలా ఉంచాలి?

బెడ్​రూమ్​లో వాస్తుప్రకారం ఒక అద్దం ఉంటే మంచిది. అయితే దానిని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు నిద్రిస్తున్నప్పుడు అద్దంలో కనిపించకుండా ఉండాలంటే.. అద్దం ఎప్పుడూ బెడ్​కు కాస్త దూరంగా పక్కన వైపు ఉండేలా చూసుకోవాలంటున్నారు. అలాగే ఎప్పుడు అద్దాన్ని మంచానికి ఎదురుగా ఏర్పాటు చేయకూడదంటున్నారు వాస్తు నిపుణులు.

రోజూ పడకగదిలో ఈ పని చేస్తున్నారా? - లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవు!

గదిని ఎలా అలంకరించాలి?

చాలా మంది పడక గదిని అలంకరించడానికి ఫొటో ఫ్రేమ్‌లను ఉపయోగిస్తారు. నూతన వధూవరులు కూడా వాస్తుప్రకారం.. హ్యాపీనెస్​ని పెంచే ఫొటోలను గదిలో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. బెడ్​రూమ్​లో ఎప్పుడూ గదిలో దేవుడి, ఒంటరి మానవులు లేదా అడవి జంతువుల చిత్రపటాలను ఉంచకూడదు. కొత్తగా పెళ్లైన జంట తమ ఫొటోలతో పడకగదిని అలంకరించుకోవచ్చంటున్నారు వాస్తు నిపుణులు.

గది గోడ రంగు ఎలా ఉండాలి?

ఇక చివరగా కొత్తగా పెళ్లైన వారు వాస్తుప్రకారం బెడ్​రూమ్​ను అలంకరించుకోవడానికి గుర్తుంచుకోవాల్సిన మరో విషయం.. గోడల రంగు. మీకు ఇష్టమైన రంగును మాత్రమే పడకగది గోడలపై వేయించండి. వీలైతే సాధ్యమైన చోట రెడ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇది శక్తిని పెంపొందించడమే కాకుండా నూతన దంపతలు మధ్య బంధాన్ని మనోహరంగా మార్చుతుంది. వారి మధ్య ప్రేమను పెంచుతుంది. అలాగని ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు రెడ్ కలర్ సమస్యలను సృష్టించే అవకాశం ఉందంటున్నారు వాస్తు నిపుణులు. అదేవిధంగా దంపతుల మధ్య గొడవలకు దారి తీయవచ్చంటున్నారు. ఇలా మేము చెప్పిన వాస్తు టిప్స్ పాటిస్తూ కొత్తగా పెళ్లైన వారు బెడ్​రూమ్​ను అలంకరించుకున్నారంటే వారి బంధం మరింత పడుతుందంటున్నారు వాస్తు నిపుణులు.

బెడ్‌ కింద ఇవి పెడుతున్నారా? - భార్యాభర్తల మధ్య గొడవలకు ఇవే కారణం కావొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.