ETV Bharat / spiritual

చెప్పుల విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? - ఆర్థిక నష్టాలు తప్పవట!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 3:36 PM IST

Vastu Tips for Shoes: చాలా మంది వాస్తును నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇంట్లోని వస్తువులు సరైన దిశలో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని భావిస్తారు. ఇలా ప్రతిదానికి వాస్తు పాటించే చాలా మంది.. షూస్​, చెప్పులు విషయానికి వచ్చే సరికి దానిని మర్చిపోతారు. కానీ బూట్లు, చెప్పులు ఉంచడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

Vastu Tips for Shoes
Vastu Tips for Shoes

Vastu Tips for Shoes To Keep Right Way At Home: చాలా మంది ఇండియన్స్​ వాస్తు ప్రకారమే నడుచుకుంటారు. ఇంటి నిర్మాణం, కార్యాలయాలు, షాపులు ఇలా నిర్మాణం ఏదైనా వాస్తు కంపల్సరీ. కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు.. ఇంట్లోని వస్తువులను సరైన స్థలంలో.. సరైన పద్ధతిలో ఉంచే విషయంలో కూడా వాస్తును ఫాలో అవుతారు. అలా ఉంచకపోతే, ప్రతికూల శక్తి మనపై ఆధిపత్యం చెలాయిస్తుందని.. మన జీవితంలో ఆనందం మాయమవుతుందని, ఆర్థిక నష్టాలు వస్తాయని ఆందోళన చెందుతారు. ఇలా ప్రతిదానికి వాస్తు పాటించే చాలామంది.. షూస్​, చెప్పులు విషయానికి వచ్చే సరికి దానిని మర్చిపోతారు. కానీ బూట్లు, చెప్పులు ఉంచడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

ఇంటి మెయిన్ డోర్ దగ్గర: చాలా మంది చెప్పులను గుమ్మానికి ఎదురుగా విడుస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మెయిన్ డోర్ దగ్గర పాదరక్షలు ఉంచకూడదు. ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం పాజిటివ్ ఎనర్జీకి ముఖ్యమైనది. అందుకే ఇంటి మెయిన్ డోర్ వద్ద బూట్లు, చెప్పులు విడవకూడదు. ఇలా చేస్తే మన ఇంటికి లక్ష్మీదేవి రాకను అడ్డుకున్నట్లు అవుతుందని.. క్రమంగా పేదరికం మనల్ని పట్టి పీడిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. కాబట్టి పొరపాటున కూడా ఇంటి మెయిన్ డోర్ దగ్గర చెప్పులు పెట్టకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

ఇంట్లో వాస్తు దోషంతో ఇబ్బందులా? - కర్పూరంతో ఇలా చెక్​ పెట్టండి!

బెడ్​రూమ్​: చాలా మంది బెడ్​రూమ్​లో దుస్తుల కబోర్డ్​ పక్కన షూ రాక్​ను పెట్టుకుంటారు. కానీ ఇలా చేయొద్దని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తలపై ప్రతికూల శక్తి ప్రభావం చూపుతుందని, ఇంట్లో విబేధాలు తలెత్తుతాయని అంటున్నారు. కొన్నిసార్లు భార్యాభర్తలు విడిపోయే స్థాయికి చేరుకుంటారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పడకగదిలో షూ రాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని సూచిస్తున్నారు.

ఈ దిశలో ఉండొద్దు: ఈశాన్య దిశలో పొరపాటున కూడా చెప్పులు, బూట్లు పెట్టకూడదు. అలాగే ఉత్తరం, తూర్పు దిశల్లో కూడా వీటిని ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబం ఆర్థిక నష్టాలతో అప్పులపాలవుతుందని హెచ్చరిస్తున్నారు. బదులుగా.. చెప్పులు, బూట్లు ఇంటికి దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచవచ్చు. చెప్పులు పెట్టుకోవడానికి ఈ రెండు దిక్కులు శుభప్రదంగా భావిస్తారు. అంతే కాకుండా చెప్పులు, షూస్​ పెట్టుకునేందుకు ఓపెన్​ షూ రాక్స్​ కాకుండా.. క్లోజ్డ్​ రాక్స్​ వాడమని సలహా ఇస్తున్నారు. అలాగే షూస్​ ఇంకా చెప్పులు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు.

ఇంట్లో గణపతి చిత్రం ఏ దిక్కున ఉండాలి - వాస్తు చెబుతున్నది ఇదే!

గుమ్మం వద్ద ఇవి పెడుతున్నారా? ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చొరబడుతుందట!

మెట్ల కింద వీటిని ఉంచుతున్నారా? ఈ నష్టాలు తప్పవట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.