ETV Bharat / spiritual

ఎంత సంపాదించినా రూపాయి మిగలట్లేదా? - ఈ వాస్తు దోషాలే కారణం!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 4:53 PM IST

Vastu Tips for Money : చాలా మంది నుంచి ఎక్కువగా వినిపించే మాట.. "ఎంత సంపాదించినా రూపాయి మిగలట్లేదు"! నెలాఖరుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని బాధపడతారు. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? అయితే.. ఇందుకు మీరు డబ్బు దాచే విషయంలో చేసే కొన్ని పొరపాట్లే కారణం కావొచ్చంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు!

Vastu Tips for Money
Money

Avoid These Vastu Mistakes to Saving Money : ప్రతి ఒక్కరూ సంపాదన మెరుగుపరుచుకొని ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలవాలని కోరుకుంటారు. అందుకోసం రాత్రింబవళ్లు ఎంతో కష్టపడుతుంటారు. కానీ.. ఎంత డబ్బు సంపాదించినా రూపాయి నిలవడం లేదు అంటారు మెజార్టీ జనం! ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి ఇంట్లో డబ్బును సరైన స్థలంలో ఉంచకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. మరి.. ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రతికూల ప్రభావం : చాలా మంది బీరువాలో డబ్బుతో పాటు కొన్ని విలువైన పత్రాలు, రికార్డులను దాచి పెడుతుంటారు. కొందరు మాత్రం బీరువాలో మనీతో పాటు కొన్ని ప్రతికూల ప్రభావం చూపే పత్రాలను స్టోర్ చేస్తుంటారు. అంటే.. కోర్టు కేసు పత్రాలు లేదా కుటుంబ వివాదాలకు సంబంధించిన పత్రాలను ఉంచుతుంటారు. అయితే.. వాస్తుప్రకారం ఇలాంటి పత్రాలను డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో ఉంచడం మంచిది కాదంటున్నారు వాస్తు పండితులు. అది అనవసరమైన ఖర్చులకు దారి తీస్తుందని చెబుతున్నారు.

చిరిగిన నోట్లు : ఎక్కువ మంది చేసే మరో పొరపాటు ఏంటంటే.. చిరిగిన నోట్లను కూడా బీరువాలో దాస్తుంటారు. కానీ.. వాస్తుప్రకారం పొదుపు చేసే డబ్బుతో కలిపి పాత, చిరిగిన నోట్లను ఉంచడం మంచిది కాదంటున్నారు వాస్తుపండితులు. ఇది కూడా డబ్బు నిల్వకపోవడానికి కారణం కావొచ్చంటున్నారు. కాబట్టి, మీ దగ్గర అలాంటి చిరిగిన నోట్లు ఉంటే వాటిని పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. లేదా బ్యాంకుకు వెళ్లి ఆ నోట్లను మార్పిడి చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.

డబ్బు ఉంచే ప్రదేశం రంగు : వాస్తుప్రకారం మీరు నగదు దాచే ప్రదేశం రంగు కూడా డబ్బు నిల్వకపోవడానికి కారణం కావొచ్చంటున్నారు వాస్తుశాస్త్ర పండితులు. అందుకే.. డబ్బును ఉంచే ప్రదేశం రంగు విషయంలో జాగ్రత వహించాలంటున్నారు. వాస్తుప్రకారం.. మీరు డబ్బు బీరువాలో ఉంచితే.. బీరువాకు మెటాలిక్ రంగు ఉండడం శుభప్రదమని చెబుతున్నారు. అలాగే.. మెటల్, గోల్డ్ లేదా లేత బూడిద రంగు కలిగి ఉన్న అల్మరాలను ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు. కానీ, నలుపు లేదా ముదురు ఎరుపు రంగు వాటిని ఎప్పుడూ వాడకూడదంటున్నారు.

మందులతో డబ్బు ఉంచడం : చాలా మంది ఇంట్లో డబ్బు దాచే ప్రదేశంలో మందులను ఉంచుతుంటారు. కానీ.. వాస్తుప్రకారం డబ్బుతో కలిపి మందులు ఉంచడం మంచిది కాదంటున్నారు. కాబట్టి మీకు ఆ అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం, ఒకవేళ ఇప్పటికే ఇలా ఉంచితే వాటిని అక్కడ నుంచి తీయడం మంచిది అంటున్నారు. లేదంటే వైద్య ఖర్చులు పెరిగి లైఫ్​లో చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు.

సరైన ప్రదేశం : మీరు బీరువాలో డబ్బు నిల్వ చేస్తున్నట్లయితే వాస్తుప్రకారం అది ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలట. అలాగే దానికి ఎదురుగా టాయిలెట్ డోర్ ఉండకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. వాస్తుప్రకారం ఇలా ఉండడం అస్సలు మంచిది కాదంటున్నారు వాస్తు పండితులు.

కెరీర్​ ఎదుగూబొదుగూ లేకుండా సాగుతోందా? - వాస్తు సరి చూసుకున్నారా!

పర్సులో ఈ వస్తువులు పెడుతున్నారా? - వాస్తు ప్రకారం మీకు ఆర్థిక కష్టాలు గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.