ETV Bharat / spiritual

ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌ సరైన దిశలో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ?? - Vastu Tips For home

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 5:35 PM IST

Vastu Tips For Dining Table : దేశంలో మెజార్టీ ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు. ఇంటి నిర్మాణం నుంచి మొదలు పెడితే, ఇంట్లోని వస్తువుల అమరిక వరకు వాస్తు నియమాలను పాటిస్తారు. అయితే, వాస్తు ప్రకారం.. మీ ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌ ఏ దిశలో ఉండాలో తెలుసా?

Vastu Tips For Dining Table
Vastu Tips For Dining Table

Vastu Tips For Dining Table : మనిషి జీవితంపై వాస్తు ప్రభావం ఎంతగానో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎంత కష్టమైన పని చేసినప్పటికీ, సరైన ఫలితాన్ని మనం పొందలేకపోవచ్చు. అలాగే ఎంత డబ్బు సంపాదించినా కూడా, ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లోనే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయేమో చూసుకోవాలి. ఇదిలా ఉంటే.. ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసే డైనింగ్‌ టేబుల్‌ సరైన దిశలో లేకపోతే కూడా కొన్ని ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఇంటి నిర్మాణంలో వాస్తు నియామాలను పాటించిన విధంగానే, ఇంట్లోని వస్తువుల విషయంలో కూడా వాస్తును చూసుకోవాలని సూచిస్తున్నారు. మరి, వాస్తు ప్రకారం డైనింగ్‌ టేబుల్‌ విషయంలో పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

డైనింగ్‌ టేబుల్‌ విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలు

  • వాస్తు ప్రకారం.. డైనింగ్‌ టేబుల్‌ గుండ్రంగా లేదా చతురస్రాకారంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు వాస్తు పండితులు.
  • అలాగే, ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు డైనింగ్‌ టేబుల్‌ పైన కొన్ని రకాల పండ్లను కట్‌ చేసుకుని పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
  • డైనింగ్‌ టేబుల్‌ ఉన్న ప్రాంతంలో వెలుతురు సరిగ్గా ఉండేలా మంచి లైట్‌లను ఏర్పాటు చేసుకోవాలి.
  • వాస్తు ప్రకారం.. ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌ ఈశాన్య దిశలో ఉండటం మంచిదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. డైనింగ్‌ టేబుల్‌ ఈ దిశలో ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్‌ వాతావరణం నిండిపోతుందని అంటున్నారు.

హనుమాన్‌ జయంతి ఎప్పుడో తెలుసా? - ఆ రోజున భక్తులు ఏం చేయాలంటే! - Hanuman Jayanti 2024 Date

  • దాంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు వాస్తు పండితులు.
  • కొంత మంది వంటగదికి దూరంగా డైనింగ్‌ టేబుల్‌ను ఏర్పాటు చేసుకుంటారు. అయితే, వాస్తు ప్రకారం డైనింగ్‌ టేబుల్‌ ఇలా అస్సలు ఉండకూడదట.
  • వీలైనంత వరకూ డైనింగ్‌ టేబుల్‌ను కిచెన్‌కు దగ్గరగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల కిచెన్‌ నుంచి ఫుడ్‌ ఐటమ్స్‌ తొందరగా తీసుకుని రావచ్చని అంటున్నారు.
  • అలాగే కిచెన్‌, డైనింగ్‌ టేబుల్‌ ఉన్న ప్రాంతంలో లైట్‌ ఆరెంజ్‌, లైట్‌ గ్రీన్‌, లైట్‌ బ్లూ కలర్‌లను వేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు.
  • అలాగే ఇంట్లో అందరూ కలిసే భోజనం చేసేటప్పుడు టీవీ చూడటం, ఫోన్‌ మాట్లాడటం చేయకండి. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. కాబట్టి, భోజనం చేసే సమయంలో అందరూ కలిసి ప్రశాంతంగా తినండి.
  • ఇంకా ఎప్పుడూ డైనింగ్‌ టేబుల్‌ క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. టేబుల్‌ పైన ప్లేట్‌లు, గ్లాసులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు వాస్తు పండితులు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వాస్తుప్రకారం - మీ ఇంట్లో కారు, బైక్ ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలుసా?

వాస్తు దోషం: ఇంట్లో క్యాలెండర్ ఆ దిశలో ఉంటే అంతే - ఆర్థిక ఇబ్బందులు తప్పవట! - Vastu Tips For Calendar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.