హనుమాన్‌ జయంతి ఎప్పుడో తెలుసా? - ఆ రోజున భక్తులు ఏం చేయాలంటే! - Hanuman Jayanti 2024 Date

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 1:44 PM IST

Hanuman Jayanti 2024

Hanuman Jayanti 2024 : హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో హనుమాన్‌ జయంతి ఒకటి. కోరిన కోర్కెలను తీర్చే భగవంతుడిగా హనుమంతుడిని కొలుస్తారు. ఎలాంటి కష్టం వచ్చినా.. ఆంజనేయ స్వామిని తలచుకుంటే బాధలన్నీ తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి స్వామి జయంతి ఈ ఏడాది ఏ రోజున వచ్చింది? ఆ రోజున భక్తులు ఏం చేయాలి? మీకు తెలుసా?

Hanuman Jayanti 2024 Date : హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో 'హనుమాన్‌ జయంతి' ఒకటి. ప్రతీ సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజును దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. అయితే.. ఈ సంవత్సరం హనుమన్‌ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. మరి ఈ ఏడాది హనుమాన్‌ జయంతి ఏ రోజున వచ్చింది? ఆ రోజున భక్తులు ఏం చేయాలి? వంటి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ఈ సారి హనుమాన్‌ జయంతి ఎప్పుడు వచ్చింది?
హిందూ పురాణాల ప్రకారం.. హనుమంతుడు మంగళవారం రోజున జన్మించాడని నమ్ముతారు. అందుకే మంగళవారం రోజున చాలా మంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అయితే.. ఈ సంవత్సరం హనుమాన్‌ జయంతి మంగళవారం రోజున వచ్చింది. దీంతో.. ఈ సారి వచ్చే హనుమాన్ జయంతి ఎంతో శుభప్రదమైనదని పండితులు చెబుతున్నారు.

వేద పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 23 తేదీన హనుమాన్‌ జయంతిని జరుపుకోనున్నారు. ఆ రోజున తెల్లవారుజామున 03.25 గంటలకు నుంచి చైత్ర పూర్ణిమ తిథి ప్రారంభమై, ఏప్రిల్ 24 బుధవారం ఉదయం 05:18 గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే హనుమాన్‌ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తం ఉదయం 04:20 నుంచి 05:04 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 11:53 నుంచి 12:46 వరకు అభిజీత్ ముహూర్తం ఉంటుంది.

హనుమాన్‌ జయంతి రోజు ఏం చేయాలి?

  • భక్తులందరూ హనుమన్‌ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి, స్నానం చేసి ఆంజనేయస్వామి గుడికి వెళ్లాలి.
  • పవిత్రమైన హనుమాన్‌ జయంతి రోజున ఆ స్వామి వారికి సువాసన కలిగిన నూనె, సింధూరాన్ని అర్పించాలని పండితులు చెబుతున్నారు.
  • అలాగే భక్తులు ప్రత్యేక ఉపవాసం ఉండటం మంచిది.
  • స్వామి వారికి పవిత్రమైన ఈ రోజున నేలపైనే నిద్రించాలి. ఇంకా బ్రహ్మచర్యాన్ని కూడా అనుసరించాలని పండితులు చెబుతున్నారు.
  • అలాగే హనుమంతుడి గుడిలో జరిగే భజనలు, కీర్తనలు, వంటి ఆధ్యాత్మిక కార్యక్రమల్లో పాల్గొనాలి. ఇంకా హనుమంతుడికి ఇష్టమైన ఈ రోజున నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
  • ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున పూజలు, కార్యక్రమాలు చేయడం వల్ల కష్టాలు అన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుందని పేర్కొన్నారు.

హనుమంతుడు సింధూరం రంగులోనే ఉంటాడెందుకు? - ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా?

మిమ్మల్ని ఈ సమస్యలు వేధిస్తున్నాయా? - అయితే శని దోషం ఉన్నట్టేనట!

శనిదేవుడికి బెల్లం నైవేద్యం- ఆంజనేయుడికి ఆకుపూజ- శనివారం ఇవి చేస్తే మీ సమస్యలన్నీ క్లియర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.