ETV Bharat / spiritual

మీ పిల్లలు చదువుపై ఏకాగ్రత పెట్టడం లేదా ? - అయితే వాస్తు ప్రకారం ఇలా చేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 5:13 PM IST

Vastu Tips For Child Study : మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకం పట్టుకోవడం లేదా? పట్టుకున్నా కూడా ఎక్కువ సేపు ఏకాగ్రతగా చదవలేకపోతున్నారా ? అయితే, ఇంట్లో పిల్లల స్టడీ రూమ్‌ వాస్తు ప్రకారం లేకపోవడమే ఇందుకు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు! అలాగే వారు ఏకాగ్రతగా చదవడానికి కొన్ని వాస్తు టిప్స్ పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Vastu Tips For Child Study
Vastu Tips For Child Study

Vastu Tips For Child Study : మన దేశంలో మెజారిటీ హిందూ కుటుంబాలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతాయి. ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ దగ్గరి నుంచి మొదలు పెడితే గదులు ఉండే దిశ, నూతన గృహ ప్రారంభోత్సవం వరకు అన్ని పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకుంటారు. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే ఇంట్లో సుఖశాంతులు, ప్రశాంతత ఉంటాయని విశ్వసిస్తారు. అలాగే మీ పిల్లలు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోవడానికీ వాస్తు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పిల్లలు బాగా చదవాలంటే వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం ఇలా చేస్తే మంచిది!

  • పిల్లలు ఏకాగ్రతగా చదవడానికి వారికి ఒక స్టడీ రూమ్‌ వంటిది ఏర్పాటు చేయాలి. ఇది కచ్చితంగా తూర్పు లేదా పడమర దిశలో ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
  • స్టడీ రూమ్‌ తూర్పు దిక్కులో ఉంటే ఇంకా మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు చదువుపై దృష్టి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉందని అంటున్నారు.
  • అలాగే స్టడీ రూమ్‌లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను చేయాలంటున్నారు.
  • అలాగే పిల్లలు చదువుకునే రూమ్‌ గోడలు ఆకుపచ్చ, నీలం, పసుపు, తెలుపురంగుల్లో ఉంటే మంచిది. ఎందుకంటే.. ఈ రంగులు పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతాయి.
  • పిల్లల స్టడీ టేబుల్‌ దీర్ఘ చతురస్రాకారంలో సౌకర్యంగా ఉండేలా ఉంటే వాస్తు ప్రకారం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
  • అదేవిధంగా పిల్లల స్టడీరూమ్‌లో వాళ్లకు ఇష్టమైన రోల్‌మోడల్స్‌, మ్యాప్స్‌, గడియారం వంటివి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ వారిలో ఏకాగ్రతను నింపుతాయంటున్నారు.
  • ఇంకా పిల్లలు చదువుకునే రూమ్‌కు దగ్గరగా టీవీ, మ్యూజిక్‌ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేయకూడదని వాస్తు నిపుణులంటున్నారు. దీనివల్ల వారి ఏకాగ్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
  • ఇంట్లో చిన్న కుండీలో మనీప్లాంట్‌ వంటి మొక్కల్ని పెంచాలి. ఇవి వారిలో ప్రశాంతమైన ఆలోచనలు కలగడానికి సహాయం చేస్తాయని చెబుతున్నారు.
  • పిల్లలు చదువుకునే గదిలో అద్దం వంటివి ఉంచకూడదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవి ఉండటం వల్ల వారు తరచూ అద్దంలో చూసుకుంటూ ఉండటంతో ఏకాగ్రతను కోల్పోయే అవకాశం ఉంటుందంటున్నారు.
  • ఇంకా వారి స్టడీ రూమ్‌ పక్కన మెట్ల వంటివి ఉండకుండా చూసుకోవాలంటున్నారు. దీనివల్ల ఇతరులు నడుస్తున్నప్పుడు వచ్చే శబ్దాల వల్ల పిల్లలు చదువుపై ఏకాగ్రత పెట్టలేరని అంటున్నారు.
  • ఇక చివరగా పిల్లలను పదేపదే చదవమని ఒత్తిడి పెంచకూడదంట. వారు చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించి ప్రోత్సహించాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇంట్లో కరెంట్​ మీటర్ ఎక్కడ ఉండాలి? మెట్ల కింద పూజ గది కట్టొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

ఈ 6 వాస్తు టిప్స్ పాటిస్తే - మీ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది!

చెప్పుల విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? - ఆర్థిక నష్టాలు తప్పవట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.