ETV Bharat / spiritual

ఆ రాశివారికి ప్రమాదం జరిగే అవకాశం- జాగ్రత్త!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 4:54 AM IST

Horoscope Today 6 February 2024
Horoscope Today February 6th 2024

Horoscope Today February 6th 2024 In Telugu : ఫిబ్రవరి 6న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 6th 2024 : ఫిబ్రవరి 6న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టులు, అసైన్​మెంట్లు ప్రారంభించడానికి ఇది చాలా మంచి రోజు. కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటారు. ఆఫీసులో మీకు అనుకూల వాతావరణం ఉండకపోవచ్చు. కొన్ని వివాదాలు మానసికంగా మిమ్మల్ని చీకాకు పెడతాయి.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి కాస్త మానసిక ఒత్తిడికి, చికాకుకు లోనవుతారు. కానీ సాయంత్రానికి సమస్యలు కాస్త తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి ఐశ్వర్య సిద్ధి కలిగే అవకాశం ఉంది. మీరు చేసిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. స్నేహితులు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. నచ్చిన ఆహార పదార్థాలను రుచి చూస్తారు. మీలో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారి మనస్థితి చాలా అస్థిరంగా ఉంటుంది. కానీ నిగ్రహం కోల్పోకూడదు. ఎంతటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినా, మనోధైర్యంతో ఎదుర్కోవాలి. దైవ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం ఫర్వాలేదు.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంలో తప్పులు చేయకూడదు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో అడుగులు వేయాలి. పెట్టుబడులు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉదయం అంతా బాగానే ఉంటుంది. కానీ సాయంత్రానికి కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. దానితో మీరు ఒత్తిడికి గురవుతారు. అయితే స్నేహితులు, సన్నిహితుల అండతో అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటారు.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి కొన్ని అనవసర విషయాలు చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. కనుక మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి చాలా బాగుంటుంది. మీ లక్ష్యాన్ని కచ్చితంగా సాధించగలుగుతారు. వ్యాపార, వ్యవహారాల్లో లాభాలు సంపాదిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోవాలి.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారి తారాబలం చాలా బాగుంది. కానీ వాహనం నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. సహనం వహించాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి చాలా ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు మంచి లాభాలు సంపాదిస్తారు. కానీ కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారిపై వరాల జల్లు కురుస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. జీతం పెరుగుతుంది. మీ పిల్లలు అన్ని రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేయాలని అనుకుంటారు. ఆరోగ్యం ఫర్వాలేదు.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు అన్నింటా మంచి విజయాలు సాధిస్తారు. తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేస్తారు. ఆర్థికంగా బాగా లాభపడతారు. ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది. కానీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.