ETV Bharat / spiritual

ఆ రాశివారికి శ్రమకు తగ్గ ఫలితం పక్కా- శివాష్టకం పఠిస్తే చాలా మంచిది! - Horoscope Today April 16th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 5:26 AM IST

Horoscope Today April 16th 2024
Horoscope Today April 16th 2024

Horoscope Today April 16th 2024 : ఏప్రిల్​ 15న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 16th 2024 : ఏప్రిల్​ 16న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటే మేలు. సున్నితమైన విషయాలకు అతిగా స్పందిచవద్దు. అనవసరమైన ఆలోచనలు వీడి ముందుకెళ్లండి. స్థిరాస్తి గొడవలు వంటివి ఉంటాయి. ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయవద్దు. విద్యార్థులకు తీవ్రంగా శ్రమిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాలు ఇబ్బందికరంగా, సంక్లిష్టంగా మారుతాయి. ఓటములు, సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. అయితే మీ ప్రతిభతో అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం ఉంటుంది. శివారాధనతో విజయం మీదే!

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజంతా గతం తాలూక జ్ఞాపకాలతో గడిపేస్తారు. మీ మేధస్సుకు పదును పెట్టే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. గతాన్ని వీడి మంచి భవిష్యత్ కోసం చక్కని ప్రణాళికలు వేసుకుంటే మంచిది. దుర్గాదేవి ఆరాధనతో సత్ఫలితాలను పొందుతారు.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజంతా సరదాగా గడిచిపోతుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఆర్ధికంగా బలపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం శ్రీరామాలయం సందర్శించండి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్ధికంగా మంచి ప్రయోజనాలు అందుకుంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. స్పెకులేషన్ లాభాలను ఇస్తుంది. పాత బకాయిలు వసూలు అవుతాయి. వినోద కార్యక్రమాల నిమిత్తం ధనవ్యయం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మీ కల నెరవేరుతుంది. వృత్తిఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఆర్ధికంగా బలపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. సూర్య ఆరాధన మంచిది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని సంఘటనలు మానసిక అశాంతికి కారణమవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ఆర్ధికంగా ఫర్వాలేదనిపిస్తుంది. లింగాష్టకం పఠిస్తే శుభం జరుగుతుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సకాలంలో అన్ని పనులు పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి విజయ సూచన ఉంది. ఆప్తుల సహకారం ఉంటుంది. అవసరానికి సరిపడా డబ్బు చేతికి అందుతుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో పనిచేసి గొప్ప లాభాలను అందుకుంటారు. చేసే ప్రతి పనిలోనూ విజయసిద్ధి ఉంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. పెద్దల ఆశీర్వాదబలం మీ వెంటే ఉంటుంది. గణపతి ధ్యానం శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఆర్ధికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారస్తులు గొప్ప లాభాలను అందుకుంటారు. అన్ని పనుల్లో విజయం ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కలహ సూచన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అన్నింటా అనుకూలత ఉంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. శ్రమకుతగిన ఫలితం ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మేలు. సమయస్ఫూర్తితో ఉంటే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. శివాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.