ETV Bharat / politics

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ - 10 అంశాలతో టీడీపీ-జనసేన 'బీసీ డిక్లరేషన్'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 8:10 PM IST

TDP_Janasena_BC_Declaration_Meeting
TDP_Janasena_BC_Declaration_Meeting

TDP Janasena BC Declaration Meeting: బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడంతో పాటు నెలకు 4 వేల రూపాయలకు పెంచుతామని టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించాయి. బీసీలకు 'ప్రత్యేక రక్షణ చట్టం' తీసుకొస్తామని తెలిపారు. మంగళగిరిలో జరిగిన 'జయహా బీసీ' సభలో మొత్తం 10 అంశాలతో బీసీ డిక్లరేషన్​ను చంద్రబాబు, పవన్ కల్యాణ్​ విడుదల చేశారు.

TDP Janasena BC Declaration Meeting: మంగళగిరిలో జరిగిన జయహా బీసీ సభలో మొత్తం 10 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్​ను చంద్రబాబు, పవన్ కల్యాణ్​ విడుదల చేశారు. అవి ఏంటంటే?

  1. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం. పెన్షన్​ను నెలకు 4 వేల రూపాయలకు పెంచుతాం.
  2. ప్రత్యేక రక్షణ చట్టం: బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుంచి రక్షణ కోసం 'ప్రత్యేక రక్షణ చట్టం' తీసుకొస్తాం. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాం. జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలు క్రూరంగా హత్యకు గురయ్యారు.
  3. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం. వైసీపీ ప్రభుత్వం 75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించింది. అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
  4. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ను వైసీపీ ప్రభుత్వం 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి, 16 వేల 800 పదవులు దూరం చేశారు. అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్ అమలుచేస్తాం. తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తాం.
  5. బీసిలకు ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం. స్వయం ఉపాధికి ఐదేళ్లలో 10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. జగన్‌ రెడ్డి 'ఆదరణ' లాంటి 30 పథకాలు రద్దు చేశారు. 5000 కోట్లతో 'ఆదరణ' పరికరాలిస్తాం. మండల లేదా నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్, ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం.
  6. చట్టబద్ధంగా కుల గణన నిర్వహిస్తాం.
  7. చంద్రన్న బీమా 10 లక్షలతో పునరుద్దరిస్తాం. పెళ్లి కానుకలు లక్ష రూపాయలకు పెంచుతాం.
  8. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.
  9. విద్యా పథకాలు అన్నీ పునరుద్దరిస్తాం. నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం. షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం. పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్దరిస్తాం. స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభిస్తాం.
  10. బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం.

ఈ విధంగా మొత్తం 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు.

వైసీపీ పాలనలో 300 మంది బీసీలను చంపేశారు: పవన్ కల్యాణ్​

బీసీల దశ, దిశ మార్చడం కోసమే 'బీసీ డిక్లరేషన్‌': చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.