ETV Bharat / opinion

కొత్త ప్రభుత్వం వస్తే ఐదేళ్ల అరాచకాలకు భారీ మూల్యం చెల్లించక తప్పదా? - Prathidwani on YSRCP Attacks

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 2:05 PM IST

Prathidwani: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత వైఎస్సార్సీపీ రాక్షస గణాలు మూకదాడులకు తెగబడ్డాయి. మాచర్ల, గురజాల, బాపట్ల, తిరుపతి, తాడిపత్రి నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టించాయి. 'అరాచకాలకు చెల్లించక తప్పదు భారీ మూల్యం!' అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ ఏ.సురేష్, సీనియర్ న్యాయవాది సుబ్బారావు పాల్గొన్నారు.

Prathidwani on YSRCP Attacks After Polling in Andhra pradesh
Prathidwani on YSRCP Attacks After Polling in Andhra pradesh (ETV Bharat)

Prathidwani : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత వైఎస్సార్సీపీ రాక్షస గణాలు మూకదాడులకు తెగబడ్డాయి. మాచర్ల, గురజాల, బాపట్ల, తిరుపతి, తాడిపత్రి నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టించాయి. ప్రతిపక్ష నాయకులతో పాటు పోలీస్ అధికారులూ ఆ దాడుల్లో క్షతగాత్రులయ్యారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు పోలింగ్ సరళి చూశాకా కూడా వారిలో మార్పు రాలేదు. గెలుపు ఖాయమే అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన వైఎస్సార్సీపీ నాయకుల స్వరం తర్వాత ఎందుకు మారింది? ఓటమికి సాకులు వెతికే పనిలో పడ్డారా? పోలింగ్ సరళి చూశాకా ప్రభుత్వ మార్పు తథ్యమనే భావన ప్రజల్లోకి వెళ్లిపోయిందా? కొత్త ప్రభుత్వం వస్తే ఐదేళ్ల అరాచకాలకు భారీ మూల్యం చెల్లించక తప్పదా? 'అరాచకాలకు చెల్లించక తప్పదు భారీ మూల్యం!' అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ ఏ.సురేష్, సీనియర్ న్యాయవాది సుబ్బారావు పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తాడిపత్రిలో అగ్నికి ఆజ్యం పోసిన డీఎస్పీ చైతన్య!- జేసీ ఇంటికెళ్లి దాడి - TADIPATRI VIOLENCE

DSP Chaitanya Behind Tadipatri Violence : తాడిపత్రిలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే డీఎస్పీ వీఎన్​కే చైతన్యను పంపించటం వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం రాజంపేట డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైతన్య, గతంలో దాదాపు రెండున్నరేళ్లపాటు తాడిపత్రి డీఎస్పీగా పనిచేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టమన్నట్టుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలా వ్యవహరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా భౌతిక దాడులకు దిగారు. వారిపై అక్రమ కేసులు బనాయించారు. ఆలాంటి అధికారిని తాడిపత్రికి పంపించడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్ల మరోసారి వీరభక్తి చాటుకున్నారు.

మంగళవారం పోలీసులు భాష్పాయువు ప్రయోగించడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అదునుగా చూసుకుని డీఎస్పీ చైతన్య తన బృందంతో కలిసి తాడిపత్రిలోని జేసీ నివాసంలోకి మంగళవారం అర్ధరాత్రి చొరబడ్డారు. అక్కడి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి టీడీపీ కార్యకర్తల్ని లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో పనిచేసే దళితుడు, దివ్యాంగుడైన కిరణ్‌కుమార్‌ను ఇష్టానుసారం కొట్టారు! దాదాపు 35 మందిని అదుపులోకి తీసుకుని ఎక్కడికో తరలించారు.

రాష్ట్రం రావణకాష్టంలా మారుతుంటే ఎందుకీ మౌనం- సీఎస్, డీజీపీపై ఈసీ సీరియస్ - EC summons Andhra Pradesh DGP

తాడిపత్రిని ప్రశాంతంగా ఉంచేందుకు తాము ప్రయత్నిస్తుంటే, డీఎస్పీ చైతన్య హింసను ప్రేరేపించడంపై ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ఇంట్లో పనిమనుషులు, కంప్యూటర్ ఆపరేటర్‌పై దాడులు చేయడమేంటని గట్టిగా నిలదీశారు. తక్షణమే తాడిపత్రి వదిలి, తిరిగి రాజంపేటకు వెళ్లిపోవాలని చైతన్యను ఎస్పీ ఆదేశించారు. ఆ తర్వాత చైతన్య బుధవారం సాయంత్రం అనంతపురం నుంచి నేరుగా రాజంపేట వెళ్లిపోయారు. ఐతే అసలు చైతన్యని తాడిపత్రికి ఎవరు పిలిపించారంటే తనకు తెలియదని అనంతపురం ఎస్పీ అమిత్‌ బర్దర్‌ చెప్తున్నారు. ఇంతకంటే దారుణ వైఫల్యం ఏముంటుంది?

పల్నాడు గొడవల్లో కోవర్ట్ ఆపరేషన్? - ఇంటిదొంగలపై పోలీస్​శాఖ విచారణ - POLICE HELP IN PALNADU VIOLENCE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.