ETV Bharat / state

రాష్ట్రం రావణకాష్టంలా మారుతుంటే ఎందుకీ మౌనం- సీఎస్, డీజీపీపై ఈసీ సీరియస్ - EC summons Andhra Pradesh DGP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 7:06 AM IST

Election Commission Fire on CS Jawahar Reddy And DGP Harish Kumar Gupta: పోలింగ్‌ రోజు నుంచి దాడులతో వైఎస్సార్సీపీ మూకలు రాష్ట్రాన్ని రణరంగంగా మార్చినా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సీఎస్ జవహర్‌రెడ్డిపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారని సీఎస్‌తో పాటు డీజీపీని ప్రశ్నించింది. హింసాకాండను ముందే పసిగట్టి ఎందుకు అరికట్టలేకపోయారని అధికారులిద్దరినీ నిలదీసింది. దీనిపై ఇద్దరూ నేడు దిల్లీ వెళ్లి సీఈసీకి వివరణ ఇవ్వనున్నారు.

Election Commission Fire on CS Jawahar Reddy And DGP Harish Kumar Gupta
Election Commission Fire on CS Jawahar Reddy And DGP Harish Kumar Gupta (ETV Bharat)

Election Commission Fire on CS Jawahar Reddy And DGP Harish Kumar Gupta : రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా (DGP Harish Kumar Gupta)లపై మండిపడింది. ఈ మధ్యాహ్నం 3 గంటల30 నిమిషాలకు దిల్లీలోని సీఈసీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది.

దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? : ఎన్నికల్లో హింసకు తావులేకుండా చూడాలని తాము పదే పదే హెచ్చరించినా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని వారిపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల అనంతర హింసాకాండను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది? ఘర్షణలను ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? ఎవర్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు? వంటి అంశాలపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రం రావణకాష్టంలా మారుతుంటే ఎందుకీ మౌనం - వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఈసీ ఆదేశం (ETV Bharat)

రాష్ట్రంలో అల్లర్లపై ఈసీ సీరియస్​- సీఎస్‌, డీజీపీకి సమన్లు జారీ - EC Issued Summons to AP CS and DGP

ప్రవర్తన మార్చుకోని సీఎస్ : అధికార పార్టీతో అంటకాగుతూ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత కూడా ఆ పార్టీకి మేలు చేసేలా అనేక నిర్ణయాలు తీసుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సీఎస్‌ జవహర్‌రెడ్డి ఇప్పటికీ వైఖరి మార్చుకోలేదు. సంక్షేమ పథకాల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాల్సిందిగా ఈసీ ఆదేశిస్తే ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీలపై నెట్టేసి, వైఎస్సార్సీపీకు మేలు చేసేలా ఆయన ఇంటింటికీ పింఛన్ల పంపిణీని నిలిపేశారు. ఏప్రిల్‌లో మండుటెండల్లో గ్రామ సచివాలయాలకు వెళ్లి, మే నెలలో బ్యాంకులకు వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించి, వృద్ధుల్ని నానా అవస్థలు పెట్టారు.

తాడిపత్రి ఘటనపై డీఎస్పీని మందలించిన ఎస్పీ - అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశం - SP Reprimanded DSP Chaitanya

పోలింగ్‌ తేదీ అత్యంత సమీపంలోకి వచ్చాక జగన్‌ ఎప్పుడో బటన్‌ నొక్కిన పథకాలకు సంబంధించిన 14 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేసి, వారిని ప్రభావితం చేయాలని చూశారు. దానిపైనా ఎన్నికల సంఘం ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సీఎస్‌ చేసిన ఇలాంటి ఘనకార్యాలు చాలా ఉన్నాయి. వైఎస్సార్సీపీకి కొమ్ముకాసిన అప్పటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి సహా పలువురు ఎస్పీలు, అధికారులపై ఈసీ వేటు వేసినా సీఎస్‌లో మార్పు రాలేదు. రాజేంద్రనాథరెడ్డిని తొలగించి డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తాను ఈసీ ఇటీవలే నియమించింది. ఆయనకు యంత్రాంగంపై ఇంకా పూర్తి పట్టు లేకపోయి ఉండొచ్చు. మరి సీఎస్‌ ఏం చేస్తున్నారు? శాంతి భద్రతలపై కనీసం ఆయన సమీక్షించారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పల్నాడులో 144 సెక్షన్- భారీగా పోలీస్​ పహారా - attacks in palnadu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.