ETV Bharat / politics

లోక్​సభ బరిలో 'పొలిమేర' నటి - చేవెళ్ల స్థానానికి నామినేషన్ - POLIMERA ACTRESS MP NOMINATION

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 8:20 AM IST

Polimera Actress Dasari Sahithi
Polimera Actress Dasari Sahithi

Actress Dasari Sahithi Contests For Chevella Lok Sabha : పొలిమేర నటి దాసరి సాహితి చేవెళ్ల లోక్​సభ బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె ఈ స్థానానికి బుధవారం రోజున నామినేషన్​ దాఖలు చేశారు.

Polimera Actress Dasari Sahithi MP Nomination : సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీనటులు ఎన్నికల బరిలో నిలవడం సర్వసాధారణం అయిపోయింది. నాటి తరం నేటి తరం వరకు చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయరంగ ప్రవేశం చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్​లోకి మరో నటి చేరారు. ఆమె ఎవరో కాదు పొలిమేర సిరీస్​ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి. ఇప్పుడు ఆమె ఎన్నికల బరిలో పోటీపడుతున్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా దాసరి సాహితి పోటీలో నిలిచారు. ఈ మేరకు బుధవారం ఆమె నామినేషన్​ దాఖలు చేశారు. రాజేంద్రనగర్​లోని ఆర్వో కార్యాలయంలో ఆర్వో శశాంకకు నామినేషన్​ పత్రాలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్​లో పుట్టి హైదరాబాద్​లో స్థిరపడిన నటి సాహితీ మోడలింగ్​, సినీ రంగంలో రాణిస్తున్నారు. రాజేంద్రనగర్​ నియోజకవర్గంలో నటి సాహితీ ఓటరుగా ఉన్నారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకుని నామినేషన్​ దాఖలు చేశారు.

రంజిత్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి ఆస్కార్‌ నటుల కంటే ఎక్కువగా నటించారు : కేటీఆర్‌

ఎన్నికల అఫిడవిట్​లో వివరాలు : ఈ మేరకు తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ నామినేషన్​ పత్రాలతో అఫిడవిట్​ను దాఖలు చేశారు. తన చేతిలో రూ.74 వేలు నగదు, యాక్సిస్​ బ్యాంకు ఖాతాలో రూ.8000, తన పేరుతో రూ.3 లక్షల విలువైన బంగారం ఉందని అఫిడవిట్​లో సాహితీ పేర్కొన్నారు. తన వార్షిక ఆదాయం గత ఆర్థిక సంవత్సరానికి రూ.4,98,810గా ఉన్నట్లు వెల్లడించారు.

సాహితీ సినీ జీవితం : మేక సూరి చిత్రంతో నటిగా సాహితీ సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత సోలో బతుకే సో బెటర్​, భోళా శంకర్​, మా ఊరి పొలిమేర, సర్కార్​ నౌకరి లాంటి చిత్రాల్లో నటించారు. అయితే సినిమా విషయానికి వస్తే పొలిమేర, పొలిమేర 2 సినిమాల్లో దాసరి సాహితీ తన నటనతో ఆకట్టుకున్నారు. మొదటిభాగంలో గెటప్​ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఆమె సీక్వెల్​లో రాజేశ్​తో కలిసి నటించారు. ఇటీవల తన ఇన్​స్టా వేదికగా రాజకీయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను పవన్​కల్యాణ్​ అభిమానిని చెప్పిన సాహితీ, ఇన్​స్టాలో తాను రీల్స్​ చేసే పాటలకు పొలిటికల్​ విషయాలను ఆపాదించొద్దని అన్నారు.

తెలంగాణలోనే ధనిక అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్​ రెడ్డి రికార్డ్! - ఆస్తుల విలువ అక్షరాలా రూ.4,490 కోట్లు

'కరప్షన్, కుటుంబ పాలనకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ - ఈసారి తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలవబోతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.