ETV Bharat / politics

త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేలు పరిహారం చెల్లిస్తాం : మంత్రి తుమ్మల - Minister Tummala on Compensation

author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 5:12 PM IST

Updated : May 5, 2024, 5:23 PM IST

Minister Tummala Nageswara Rao in CPM Meeting : దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చూస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రైతు బంధు నాలుగైదు రోజులలో అందరికీ వస్తుందని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు ఈసీ అనుమతి ఇచ్చిందని త్వరలోనే రూ.10 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Thummala Comments on BJP
Minister Tummala Nageswara Rao in CPM Meeting (Etv Bharat)

Minister Tummala Nageswara Rao in CPM Meeting : దేశ రక్షణ, భవిష్యత్తు, గౌరవం కోసం కేంద్రంలో సీపీఎం ఇండియా కూటమిలో చేరి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పోరాటం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Minister Tummala on Compensation to Farmers : దేశాన్ని విచ్చిన్నం చేయాలని బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌లు) చూస్తున్నాయని మంత్రి తుమ్మల ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందు మహిళల పుస్తెలు గుంజుకుని ముస్లింలకు ఇస్తారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటని మండిపడ్డారు. ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. రైతు బంధు నాలుగైదు రోజులలో అందరికీ వస్తుందని హామీ ఇచ్చారు. ఇటీవల కురుసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఎన్నికల కమిషన్‌ శనివారం అనుమతి ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం చెల్లిస్తామని చెప్పారు.

జొన్నరైతులకు గుడ్​న్యూస్ - మద్దతు ధరకు ప్రభుత్వమే పంట కొనుగోలు - Govt Focus On Sorghum Procurement

Tummala Speech at CPM Meeting : రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంద్రాగస్టు నాటికి రెండు లక్షల రుణమాఫీ పథకం అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడడానికి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్రు నాయక్, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య, సీపీఎం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

"కాంగ్రెస్‌ పార్టీ ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించేది సీపీఎం మాత్రమే. దేశాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఓడించేందుకు ఇండియా కూటమిలో సీపీఎం చేరింది. 200 సీట్ల కంటే ఎక్కువ బీజేపీకి రావని కేసీఆర్, కేసీఆర్‌ చెబుతున్నారు. అది వాస్తవమే అయి ఉంటది." - తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేలు పరిహారం చెల్లిస్తాం మంత్రి తుమ్మల (Etv Bharat)

పంట నష్టంపై వ్యవసాయ శాఖ ఫోకస్ - నిధుల విడుదలకు సిద్ధమన్న మంత్రి తుమ్మల - crop damage in telangana

అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 2200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది : తుమ్మల నాగేశ్వర్​రావు - Minister Tummala Review Meeting

Last Updated : May 5, 2024, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.