ETV Bharat / politics

ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న కాంగ్రెస్ వాళ్లపై కేసులేవీ : కేటీఆర్‌ - KTR Tweet Today

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 12:30 PM IST

KTR Fires on CM Revanth Reddy : కాంగ్రెస్​కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. పదే పదే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్​ రెడ్డిని ఎందుకు జైళ్లో పెట్టడం లేదంటూ ఎక్స్​ వేదికగా మండిపడ్డారు. రాజకీయ పెద్దల మాటలు విని, తమను వేధిస్తే సంబంధిత అధికారులను కోర్టుకు లాగుతామంటూ కేటీఆర్ హెచ్చరించారు.

KTR
KTR Fires on CM Revanth Reddy (ETV Bharat)

KTR Fires on CM Revanth Reddy : పదే పదే ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు జైళ్లో పెట్టడం లేదని భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎంపై వ్యాఖ్యలు చేసిన ఆయన, తన బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ ఔషధాల కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఆరోపించారని మండిపడ్డారు. సచివాలయం కింద తాను నిజాం నగలు తవ్వుకున్నానని కట్టుకథను సృష్టించారని, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఫేక్ వీడియోను రేవంత్ రెడ్డి సర్క్యులేట్ చేశారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా ఉండి మరీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన నకిలీ సర్క్యులర్​ను పోస్ట్ చేశారని కేటీఆర్ ఎక్స్​లో పోస్ట్ చేశారు. ఇలా పదే పదే ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్న ముఖ్యమంత్రిని ఎందుకు జైళ్లో పెట్టరని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదన్న కేటీఆర్‌, ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ డీజీపీ రవి గుప్తా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ను నిలదీశారు. రాజకీయ పెద్దల మాటలు విని, తమను వేధిస్తే అధికారులను కోర్టుకు లాగుతామంటూ కేటీఆర్ హెచ్చరించారు.

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం : కేటీఆర్‌ - KTR Visit manne krishank

నా బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ కాంట్రాక్ట్ వచ్చిందని సీఎం ఆరోపించారు. సచివాలయం కింద నిజాం నగలు తవ్వుకున్నట్లు కథ అల్లారు. కేంద్ర హోంమంత్రి నకిలీ వీడియోను రేవంత్‌ రెడ్డి ప్రచారం చేశారు. ఓయూకు చెందిన నకిలీ సర్కులర్‌ను పోస్టు చేశారు. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైలులో ఎందుకు పెట్టరు? కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదు. ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదో డీజీపీ రవి గుప్తా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సమాధానం చెప్పాలి. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కోర్టుకు లాగుతాం. - కేటీఆర్‌ ట్వీట్

ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు : కేటీఆర్ - KTR MLC Election Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.