ETV Bharat / politics

బీజేపీకి 400 సీట్లు ఇస్తే - పెట్రోల్ ధర రూ.400 దాటుతుంది : కేసీఆర్​ - KCR Comments On BJP Congress

author img

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 10:46 PM IST

Updated : May 10, 2024, 10:57 PM IST

KCR Comments On BJP Congress : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 400 ఎంపీ సీట్లు ఇస్తే పెట్రోల్​ ధర రూ.400 దాటుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ పెట్టుబడిదారుల, ధనికుల పార్టీ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అజెండాలో పేదల సంక్షేమం గురించి ఎప్పుడూ ఉండదని విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగ్​లో పాల్గొన్న కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

KCR Comments On BJP Congress
KCR Comments On BJP Congress (ETV Bharat)

KCR Comments On BJP Congress : బీజేపీ అజెండాలో పేదల సంక్షేమం గురించి ఎప్పుడూ ఉండదని, రైతులు, చేనేత కార్మికుల గురించి ఆ పార్టీ పట్టించుకోదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. బీజేపీ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం వస్తే రూ.15 లక్షలు ఇస్తానన్నారు వచ్చాయా? అని ప్రశ్నించారు.

సిద్దిపేట ఓల్డ్​ బస్టాండ్​ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్నర్​ మీటింగ్​లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్​ బీజేపీ, కాంగ్రెస్​లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 400 ఎంపీ సీట్లు కావాలని మోదీ అడుగుతున్నారని బీజేపీకి 400 సీట్లు ఇస్తే పెట్రోల్ ధర రూ.400 దాటుతుందన్నారు.

KCR Fires ON Congress : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని కేసీఆర్​ విమర్శించారు. ఆ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. డిసెంబర్ 9నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న రేవంత్ మాట తప్పారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఫెయిల్ అయిపొయిందని దుయ్యబట్టారు. రూ.4 వేల పెన్షన్ వచ్చిందా? అని ప్రశ్నించారు ఇక రాదు కూడా అని జోస్యం చెప్పారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి చూసి బాధేసే మళ్లీ పోరాటానికి బయలుదేరాను : కేసీఆర్​ - Ex CM KCR Election Campaign

హస్తం పార్టీ హామీల్లో ఆ ఒక్కటే అమలైంది : కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మాత్రమే అమలైందని అన్నారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం వల్ల కూడా ఎవరికీ ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డికి సిద్దిపేట నుంచే లక్ష మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు. మెదక్ కలెక్టర్‌గా సిద్దిపేట ప్రాంతానికి వెంకట్రామిరెడ్డి ఎంతో సేవ చేశారన్నారు. ఒకనాడు ఇదే అంబేడ్కర్ చౌరస్తా నుంచి కరీంనగర్ పోతుంటే ధైర్యం ఇచ్చి పంపిన గడ్డ సిద్దిపేట అడ్డ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఆనాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా చేయమంటే చేయలేదన్న కేసీఆర్ తాను సీఎం అయిన తర్వాత సిద్దిపేట జిల్లా అయ్యిందని గుర్తుచేశారు. సిద్దిపేటకి రైలు, నీళ్లు తెచుకున్నామని కానీ ఈ జిల్లా రద్దుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా ఉండాలా? వద్దా అని ప్రజలను ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం, సీఎం అనేక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

బీజేపీకి 400 సీట్లు ఇస్తే - పెట్రోల్ ధర రూ.400 దాటుతుంది : కేసీఆర్​ (ETV Bharat)

కాంగ్రెస్​ ఐదు నెలల పాలనలోనే రాష్ట్రం ఆగమాగం అయింది : కేసీఆర్​ - KCR Bus Yatra in Medak

ఆరు గ్యారంటీలంటూ కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపెట్టింది : కేసీఆర్ - KCR ELECTION CAMPAIGN IN MEDAK

Last Updated : May 10, 2024, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.