ETV Bharat / politics

'కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసేందుకే చలో మేడిగడ్డ పర్యటన'

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 7:52 PM IST

Updated : Mar 1, 2024, 9:56 PM IST

Harish Rao on Medigadda Issue : కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసేందుకే చలో మేడిగడ్డ పర్యటన చేపట్టినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు నిజస్వరూపం ప్రజలకు చెప్పేందుకే మేడిగడ్డకు వచ్చామన్నారు.

BRS Leaders Visited Annaram Barrage
Harish Rao on Medigadda Issue

'కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసేందుకే చలో మేడిగడ్డ పర్యటన'

Harish Rao on Medigadda Issue : కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు(Harish Rao) ధ్వజమెత్తారు. రేవంత్​ సర్కార్​ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తాము చేపట్టిన ప్రాజెక్టుల పర్యటనతో కాంగ్రెస్‌లో చలనం వచ్చిందన్న ఆయన, తమ పర్యటనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం బెంబేలెత్తిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తామని మంత్రి ఉత్తమ్‌ చెప్పారని, ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వచ్చిన నెలలోగా పనులు ప్రారంభిస్తామని చెప్పారని తెలిపారు. మంత్రి ప్రకటనతో తమ పర్యటనకు పాక్షిక విజయం చేకూరిందని వివరించారు.

BRS Leaders Visited Annaram Barrage : కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసేందుకే చలో మేడిగడ్డ(Medigadda) పర్యటన చేపట్టినట్లు హరీశ్​రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు నిజస్వరూపం ప్రజలకు చెప్పేందుకే మేడిగడ్డకు వచ్చామన్నారు. ఈ క్రమంలోనే పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలనేదే తమ డిమాండ్‌ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతుల పక్షాన పని చేయాలని, ప్రతిపక్షాలపై బురద చల్లకూడదని అన్నారు. గత ప్రభుత్వాన్ని తిట్టి లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు ఎక్కువ తెచ్చుకోవాలన్న ఆరాటమే కాంగ్రెస్​లో కనిపిస్తోందన్న ఆయన, రాష్ట్ర, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.

మెగా ప్రాజెక్టుల్లో సమస్యలు సాధారణం : గోబెల్స్ ప్రచారంతో దేశంలో కాలం వెళ్లదీస్తున్నది రేవంత్‌ ప్రభుత్వమేనని హరీశ్​రావు దుయ్యబట్టారు. మెగా ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు రావడం సాధారణమన్నారు. వచ్చే వర్షాకాలంలో రైతులకు సాగునీరు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తే నీళ్లు ఎలా ఇవ్వాలో తాము చెబుతామన్నారు. కాలయాపన చేసి రైతుల జీవితాలతో ఆడుకోవద్దని మనవి చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరాన్ని పడగొట్టి ప్రజాక్షేత్రంలో బీఆర్​ఎస్​ను(BRS) పడగొట్టాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన, కేసీఆర్‌కు పేరు వచ్చిందనే కాళేశ్వరం ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

మిషన్ భగీరథపై లాభనష్టాలు బేరీజు వేసుకోవడం ప్రభుత్వానికి తగదు : హరీశ్​ రావు

'అవినీతిపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు. జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే. జల యజ్ఞం పేరుతో రూ.52 వేల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ తప్పుబట్టింది. నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి ఫలాలను తెలంగాణ జాతికి, రైతులకు నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదిత వ్యయంతో పూర్తయిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉంటే చూపండి. అంచనాలు అతి తక్కువగా పెరిగిన ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు 20 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చింది. కానీ 95 వేలు మాత్రమే అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ఫలాలు దాచేస్తే దాగని సత్యాలు. పెద్ద ప్రాజెక్టుల వద్ద చిన్నపాటి ప్రమాదాలు సహజమే. మరమ్మతులు చేయకుండా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాకాలంలోపు మరమ్మతులు పూర్తి చేసి, రైతులకు నీరు ఇవ్వాలి'-హరీశ్​రావు, బీఆర్​ఎస్ నాయకుడు

హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటైంది: హరీశ్‌రావు

సీఎం సాబ్!! ప్రభుత్వంలో టీఎస్​ఆర్టీసీ విలీనం ఎప్పుడు? : హరీశ్​రావు

Last Updated : Mar 1, 2024, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.