ETV Bharat / politics

సీఎం రేవంత్​ రెడ్డి భ్రమలు వదిలేసి పాలనపై దృష్టి పెడితే మంచిది : హరీశ్​ రావు - Harish Rao tweet on Employee

author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 4:32 PM IST

Harish Rao Fires on CM Revanth Reddy : కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని మాజీ మంత్రి హరీశ్​రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్​ ప్రభుత్వంలో విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందని ఆయన ఎక్స్​ ఖాతాలో ట్వీట్​ చేశారు.

Harish Rao Fires on CM Revanth
Harish Rao Latest Tweet on Employee (ETV Bharat)

Harish Rao Fires on CM Revanth Reddy : తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భ్రమల్లో ఉన్నట్లున్నారని, వాటిని వీడి పాలనపై దృష్టి పెడితే మంచిదని మాజీ మంత్రి, హరీశ్​ రావు సూచించారు. విద్యుత్ ఉద్యోగులపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా ఆయన ఖండించారు. కరెంట్ కోతల విషయంలో ముఖ్యమంత్రి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

Harish Rao Tweet on Electricity Sector : విద్యుత్ రంగ వైఫల్యాలకు తానే బాధ్యుడిని అన్నట్లుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని హరీశ్​ రావు అన్నారు. ముఖ్యమంత్రి వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తోందని ఆక్షేపించారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం, 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందని, రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందని వివరించారు. కేవలం ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చిందని మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీకి గడ్డపారలు అవుతాయి : హరీశ్​రావు - Harish Rao Counter to CM Revanth

Harish Rao Latest Comments : గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఆరోపించారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని అన్నారు.

విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమని హరీశ్​ రావు ఆక్షేపించారు. సీఎం ఇలాంటి చిల్లర చేష్టలు మాని మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రెప్పపాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ ఇచ్చినట్లుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదని అన్నారు.

బీఆర్​ఎస్​పై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతోంది : హరీశ్​రావు - Harish rao Fires on BJP

కాంగ్రెస్‌పై కోపంతో బీజేపీకు ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లే : హరీశ్‌రావు - Harish Rao Comments on Congress

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.