ETV Bharat / politics

నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది: ఈటల రాజేందర్‌ - Etela Rajender on Lok Sabha Polls

author img

By ETV Bharat Telangana Team

Published : May 14, 2024, 8:20 PM IST

Etela Rajender on Telangana Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. జననాడి ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది. వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఈ లోపుగానే ఎవరి అంచనాల్లో వారు మునిగిపోయారు. ఈ నేపథ్యంలో మల్గాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి జూన్​ 4న తెలియని నిశ్శబ్ద విప్లవం ఫలితం ఉంటుందని జోస్యం చెప్పారు. బీజేపీ ఊహించని రీతిలో సీట్లు సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు.

Telangana Lok Sabha Elections  2024
Etela Rajender on Telangana Elections (ETV Bharat)

Etela Rajender on Telangana Lok Sabha Elections : ఈవీఎంలలో ఓటరు తీర్పు నిక్షిప్తమైంది. జననాడిపై ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. ప్రజాతీర్పు తమవైపే ఉందంటూ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి 12 స్థానాలు గెలుస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబితే బీఆర్​ఎస్​ అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుస్తారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. డబుల్‌ డిజిట్‌ను దాటుతామని బీజేపీ పూర్తి విశ్వాసంతో ఉంది.

Etela Rajender Prediction on Election Results : జూన్‌ 4వ తేదీన తెలియని నిశ్శబ్ద విప్లవం ఉంటుందని మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పోలింగ్ సరళి బీజేపీకి చాలా పాజిటివ్​గా ఉందని పేర్కొన్నారు. అందరూ అనుకున్న దానికి భిన్నంగా పోలింగ్‌ జరిగిందని వివరించారు. ఊహించని రీతిలో ఫలితాలు సాధించబోతున్నామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనలోనే దేశం ముందుకు పోతుందని, ఓటేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చుతామని హామీ ఇచ్చారు.

మహిళల అత్మగౌరవాన్ని కాపాడిన నేత మోదీ : ఈటల రాజేందర్​ - lok sabaha elections 2024

"అందరూ అనుకున్న దానికి భిన్నంగా పోలింగ్‌ జరిగింది. నిశ్శబ్ద విప్లవం ఫలితం జూన్ 4న తెలుస్తుంది. మోదీ పాలనలోనే దేశం ముందుకెళ్తుందని ప్రజలు భావించారు. బీజేపీకి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు. మా పార్టీ ఊహించని రీతిలో ఫలితాలు సాధించనుంది. ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చుతాం."- ఈటల రాజేందర్​, మల్గాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి

BJP Leaders on Telangana Election Results : రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజల నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది. కేంద్ర మంత్రి అమిత్​ షా తెలంగాణలో పర్యటించినప్పుడు 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారని అన్నారు. అవి కచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్​ బీజేపీనేనని ఈటల రాజేందర్​ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ పాత్ర పోషిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. వరంగల్‌లో మోదీ ప్రధాని కావాలన్న దేశ ప్రజల కాంక్ష ముందు కాంగ్రెస్ కుయుక్తులు పని చేయలేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని మహబూబ్​నగర్ ఎంపీ అభ్యర్థి డి.కె.అరుణ ధీమా వ్యక్తం చేశారు.

నిశ్శబ్ద విప్లవం ఫలితం జూన్ 4న తెలుస్తుంది ఈటల రాజేందర్‌ (ETV Bharat)

6 గ్యారంటీలంటూ మోసం చేసిన కాంగ్రెస్ - ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది : ఈటల రాజేందర్​ - Etela election Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.