ETV Bharat / politics

మూడు విచారణలు, ఆరు వేధింపులుగా కాంగ్రెస్‌ వంద రోజుల పాలన : హరీశ్‌రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 3:21 PM IST

Updated : Mar 15, 2024, 3:36 PM IST

Congress 100 Day Governance
BRS Leader Harish Rao Comments on Congress 100 Day Governance

BRS Leader Harish Rao Comments on Congress 100 Day Governance : మూడు విచారణలు, ఆరు వేధింపులుగా కాంగ్రెస్‌ వంద రోజుల పాలన ఉందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ తమ హామీలను నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

BRS Leader Harish Rao Comments on Congress 100 Day Governance : వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ మాట నిలుపుకొలేదని ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మూడు విచారణలు, ఆరు వేధింపులుగా వంద రోజుల పాలన ఉందని ఎద్దేవా చేశారు. డిసెంబరు తొమ్మిదిన రూ.2 లక్షల రుణమాఫీ(Farmer Loan Waiver) అన్నారు కానీ అతీగతీ లేదని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ గద్దెను రెండు రోజుల ముందుగానే ఎక్కారు కానీ హామీల అమలు మాత్రం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ తెలంగాణ పరువు పెంచితే రేవంత్‌ రెడ్డి కరవు పెంచుతున్నారన్నారు. కేసీఆర్‌ హయాంలో పచ్చటి పొలాలు, పదేళ్ల తర్వాత పొలాల్లో మంటలు ఉన్నాయని దుయ్యబట్టారు. రేవంత్‌ రెడ్డి పాలనలో కన్నీళ్లుకు కొరత లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెల ప్రదర్శన సీఎం నియోజకవర్గం కొడంగల్‌లోనే కనిపిస్తోందన్నారు.

నాడు ప్రచారంలో అబద్ధాలు - నేడు పాలనలో అసహనం : హరీశ్‌రావు

Harish Rao Fires on CM Revanth Reddy : కర్ణాటక నుంచి కనీసం తాగునీరు కూడా తీసుకురావడంలో పూర్తి వైఫల్యం చెందారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వచ్చే రాగానే ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకరించి బీఆర్‌ఎస్‌ పోరాటంతో వెనక్కు తగ్గారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కిట్ల(KCR Kittlu)లో పోటీ పడితే రేవంత్‌ రెడ్డి తిట్లలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి పది రోజులకోసారి దిల్లీ వెళ్లి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.

"కేసీఆర్‌ అనారోగ్యాన్ని కూడా సీఎం, మంత్రులు నీచమైన రాజకీయం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ ఒప్పందం జరిగింది. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్‌ రెడ్డి, టికెట్‌ రాకపోతే బీజేపీ నేత ఇంటికి వెళ్లారు. యూ టర్న్‌, యూ ట్యూబ్‌ పాలన మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తోంది. పార్టీల గేట్లు ఎత్తడం కాదు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి పంటలకు నీళ్లు ఇవ్వండి. రాష్ట్రంలో రైతులది జలఘోష. వంద రోజుల పాలనలో 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు." - హరీశ్‌ రావు, బీఆర్‌ఎస్‌ నేత

కాంగ్రెస్‌ వచ్చే ఆత్మహత్యలు తీసుకొచ్చే : ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పాలన పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ వచ్చింది కరవు వచ్చింది, ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయన్నారు. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్‌ వాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) ప్రజల ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. వంద రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. హామీలు అమలు చేయని రేవంత్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మూడు విచారణలు, ఆరు వేధింపులుగా కాంగ్రెస్‌ వంద రోజుల పాలన హరీశ్‌రావు

బీఆర్ఎస్​తో పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 సీట్లు - నాగర్​కర్నూల్​ ఎంపీ అభ్యర్థిగా ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడితేనే కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయి : హరీశ్‌రావు

Last Updated :Mar 15, 2024, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.