ETV Bharat / politics

పార్లమెంటు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించిన బీఆర్​ఎస్​ - BRS Appointed Coordinators

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 2:09 PM IST

BRS Appointed Coordinators
BRS Appointed Coordinators

BRS Appointed Coordinators : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ తమ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. కష్టకాలంలో ఉన్న పార్టీని బలోపేతం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని ఉవ్విళ్లూరుతున్న బీఆర్ఎస్ పార్టీ, తాజాగా ఆయా పార్లమెంట్​ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు వారి జాబితాను విడుదల చేసింది.

BRS Appointed Coordinators : లోక్​సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తమ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇటీవల పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న కారు పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్​సభ ఎన్నికల(Lok Sabha polls) కోసం సమన్వయకర్తలను ఆపార్టీ నియమించింది. మల్కాజిగిరి, చేవేళ్ల పార్లమెంట్​ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించింది. వీరంతా కలసి లోక్​సభ ఎన్నికల కోసం ఆయా నియోజక వర్గాల్లో పార్టీ నేతలు, శ్రేణులు, కార్యక్రమాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది.

BRS Election Coordinators Appointed For Constituencies : మల్కాజ్​గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును, మల్కాజిగిరి సమన్వయకర్తగా కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ నందికంటి శ్రీధర్​ను నియమించింది. కుత్బుల్లాపూర్ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత గొట్టిముక్కుల వెంగళరావు, కూకట్​పల్లి బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి అఫ్పగించారు. ఉప్పల్ సమన్వయకర్తగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ పాష, కంటోన్మెంట్ నియోజకవర్గానికి కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు.

ఎల్బీనగర్ బాధ్యతలను ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తకు ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహేశ్వరం సమన్వయకర్తగా శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, రాజేంద్ర నగర్ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత పుట్టం పురుషోత్తం రావుకు అప్పగించారు. శేరిలింగంపల్లికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్, చేవెళ్లకు పార్టీ కార్యదర్శి నాగేందర్ గౌడ్ ను సమన్వయకర్తలుగా నియమించారు. పరిగి బాధ్యతలను పార్టీ నాయకులు గట్టు రామచంద్రరావు, వికారాబాద్ బాధ్యతలను పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డికి అప్పగించారు. తాండూరు సమన్వయకర్తగా జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ ను నియమించారు

లోక్​సభ ఎన్నికల కోసం సమన్వయకర్తలు వీరే

  • మేడ్చల్- శంబీపూర్ రాజు, ఎమ్మెల్సీ
  • మల్కాజిగిరి- నందికంటి శ్రీధర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
  • కుత్బుల్లాపూర్ - గొట్టిముక్కుల వెంగళరావు, పార్టీ సీనియర్ నాయకులు
  • కూకట్ పల్లి- బేతి రెడ్డి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
  • ఉప్పల్- జహంగీర్ పాష, పార్టీ రాష్ట్ర సెక్రెటరీ
  • కంటోన్మెంట్- రావుల శ్రీధర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్
  • ఎల్బీనగర్ - బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎమ్మెల్సీ
  • మహేశ్వరం - స్వామి గౌడ్, మండలి మాజీ చైర్మన్
  • రాజేంద్రనగర్- పుట్టం పురుషోత్తం రావు, పార్టీ సీనియర్ నాయకులు
  • శేరిలింగంపల్లి- కె.నవీన్ కుమార్, ఎమ్మెల్సీ
  • చేవెళ్ల - నాగేందర్ గౌడ్, పార్టీ కార్యదర్శి
  • పరిగి- గట్టు రామచంద్రరావు, పార్టీ సీనియర్ నాయకులు
  • వికారాబాద్- పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, సీనియర్ నాయకులు
  • తాండూర్- బైండ్ల విజయ్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్

కేసీఆర్​ ప్లాన్​​ ఛేంజ్​ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్​ షోలతోనే ఎన్నికల ప్రచారం

రేవంత్​కు కేటీఆర్ ఛాలెంజ్ - మల్కాజిగిరి ఎంపీ బరిలో తేల్చుకుందామంటూ సవాల్

జనంలో ఉందాం, మళ్లీ పుంజుకుందాం - వలసల వేళ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.