ETV Bharat / politics

ఆర్​ఆర్​ ట్యాక్స్​ కోసం గంటగంటకు జీవోలు మార్చారు - మహేశ్వర్​ రెడ్డి - Maheshwar Reddy Slams CM Revanth

author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 2:50 PM IST

Updated : May 2, 2024, 3:25 PM IST

BJP MLA Maheshwar Reddy Slams CM Revanth : తెలంగాణను ఎలా దోచుకోవాలో రీసెర్చ్​ చేసి మరీ సీఎం రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డి అన్నారు. ట్యాక్స్​ల రూపంలో దోపిడీకి తెరలేపారని విమర్శించారు.

Maheshwar Reddy RR Tax
BJP Maheshwar Reddy Fires On CM Revanth Reddy

ఆర్​ఆర్​ ట్యాక్స్​ కోసం గంటగంటకు జీవోలు మార్చారు మహేశ్వర్​ రెడ్డి

BJP Maheshwar Reddy Fires On CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో రీసెర్చ్​ చేసి మరీ సీఎం రేవంత్​ రెడ్డి దోపిడీ చేస్తున్నారని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్​ రెడ్డి అన్నారు. ముఖ్యంమంత్రి పీఠంపై కన్నేసి మాయమాటలతో గద్దెనెక్కి, ఆ మరుక్షణం నుంచే దోపిడీ ప్రారంభించారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి, సీఎం రేవంత్​ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆర్​ఆర్​ ట్యాక్స్​ కోసం జీవోలను గంటగంటకు మార్చి ఇచ్చారని విమర్శించారు. సంవత్సరానికి రూ.40వేల కోట్లు ఎట్లా దోచుకోవాలో ముందే రీసెర్చ్​ చేసి పెట్టుకున్నారని ఆరోపించారు. రాహుల్​ గాంధీ, రేవంత్​ రెడ్డి రియల్ ఎస్టేట్​తో వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారని, మూర్ఖత్వంతో రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.

కాంగ్రెస్​లో శిందేలు లేకపోతే - రేవంత్​ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు : ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డి - BJP Mla Maheshwar Reddy On Congress

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, ఇప్పుడు సెటిల్ మెంట్ ఇమేజ్ అయ్యింది. సెటిల్ మెంట్ ఇమేజ్​తో వేల కోట్ల ప్రాజెక్టులు మందగిస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అసమర్ధత కాదా? కేసీఆర్, కేటీఆర్ బిల్డర్స్ వద్ద ప్లోర్స్ తీసుకున్నారు. దిల్లీలో కిస్తి కట్టాలని రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుంటున్నారు. డబుల్ ఆర్ ట్యాక్సీకి బిల్లులు ఉండవు. వేల కోట్ల రూపాయలు బిల్డర్స్ నుంచి వసూలు చేసి పావుల దిల్లీకి బారానా రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకుంటున్నారు." - ఏలేటి మహేశ్వర్​ రెడ్డి, బీజేపీ శాసన సభపక్ష నేత

BJP Leaders On CM Revanth : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రిపుల్​ ఆర్​ ట్యాక్స్​ వసూలు చేస్తుంది నిజం కాదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. దోచుకుంటున్న డబ్బంతా తన పదవి ఎక్కడపోతుందోనని ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఏలేటి అన్నారు. రియల్టర్లు, బిల్డర్లు, మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్​లో అడుగుపెట్టాలంటే భయపడుతున్నారని మండిపడ్డారు. డీకే. శివకుమార్ దారిలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు. బీ ట్యాక్స్ అనేది నిరంతర ప్రక్రియని తెలిపారు. మూర్ఖత్వంతో రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా కృష్ణారెడ్డికి, రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం బయట పెడుతానని వ్యాఖ్యానించారు.

'కోమటిరెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు - బీజేపీ గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది' - MLA MAHESHWAR REDDY HOT COMMENTS

జులై 14 సీఎం రేవంత్‌రెడ్డికి డెడ్‌ లైన్‌ : ఎంపీ అర్వింద్‌ - MP Arvind on Cm Revanth

Last Updated :May 2, 2024, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.