ETV Bharat / opinion

బలంగా 'తొలి' అడుగు- రాష్ట్రమంతా బ్రాండ్‌ మోదీ- గుజరాత్​ క్లీన్ స్వీప్​పై బీజేపీ కన్ను! - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 3:17 PM IST

Lok Sabha Polls 2024
Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024 Gujarat BJP : గుజరాత్‌లో మళ్లీ సత్తా చాటేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. 2014, 2019 ఎన్నికల్లో గుజరాత్‌లో మొత్తం 26 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ మరోసారి క్లీన్‌ స్వీప్‌ చేయాలని గురిపెట్టింది. గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో లక్షకుపైగా మెజార్టీ సాధించిన బీజేపీ, ఈసారి అదే జోరు కొనసాగించాలని వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే సూరత్‌ను ఏకగ్రీవం చేసుకున్న కమలనాథులు, మోదీ, షా సొంతరాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు.

Lok Sabha Polls 2024 Gujarat BJP : భారతీయ జనతా పార్టీ కంచుకోట గుజరాత్‌ ఈ రాష్ట్రంలో 1998 ఎన్నికల్లో ఆరంభమైన కమలం పార్టీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 26 సీట్లు ఉండగా 26 స్థానాలు గెలుచుకుని కమలనాథులు చరిత్ర సృష్టించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. మరోసారి మోదీ, షా సొంతగడ్డపై అన్ని లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుని హ్యాట్రిక్‌ సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది.

ఇప్పటికే బోణీ!
2017 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కమలం పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. కానీ తర్వాత చతికిలపడింది. అప్పట్నుంచీ కోలుకోలేకపోయింది. మూడో విడతలో మే 7వ తేదీన 25 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఏకగ్రీవమైన సూరత్‌ స్థానాన్ని కమలం తన ఖాతాలో వేసుకుంది. మిగతా 25 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుండగా పొత్తులో భాగంగా 24 సీట్లలో కాంగ్రెస్‌, 2 చోట్ల ఆమ్‌ ఆద్మీ పార్టీలు పోటీ చేస్తున్నాయి.

తొలి అడుగు బలంగా!
ఈసారి కూడా గుజరాత్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసే దిశగా కమలనాథులు తొలి అడుగు బలంగా వేశారు. పోలింగ్‌కు ముందే సూరత్‌ లోక్‌సభ నియోజకవర్గంలో తొలి విజయాన్ని నమోదు చేశారు. బీజేపీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి సంతకాలు చేసిన ముగ్గురు ప్రతిపాదకులు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని అడ్డం తిరగడం వల్ల ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులతో బీజేపీ మాట్లాడి ఉపసంహరింపజేసింది. దీంతో ఈ సీటు ఏకగ్రీవమైంది. మరోవైపు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నీలేశ్‌ను బహిష్కరించింది.

బీజేపీకి అండగా!
8 లోక్‌సభ నియోజకవర్గాలున్న సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతం బీజేపీకు అండగా నిలుస్తోంది. గుజరాత్‌లో పటేల్‌లు బీజేపీకు గట్టి మద్దతుదారులుగా ఉండడం వల్ల ఆ పార్టీ సునాయాస విజయాలను నమోదు చేస్తోంది. ఈ ఎన్నికల్లోనూ హిందుత్వతోపాటు బీజేపీ సోషల్‌ ఇంజినీరింగ్‌ పనిచేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులపై కొన్ని చోట్ల అసంతృప్తి ఉంది. అమ్రేలీ, రాజ్‌కోట్‌, సాబర్‌ కాంఠా, సురేంద్రనగర్‌, వడోదరాలో అభ్యర్థుల ఎంపిక తీరును బీజేపీలోని కొన్నివర్గాలు, ఓటర్లు తప్పుబడుతున్నారు. ఈ అసంతృప్తులను మోదీ బ్రాండ్‌, సైద్ధాంతిక మద్దతు వంటి అంశాల ద్వారా బీజేపీ అధిగమించగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బ్రాండ్‌ మోదీ
గుజరాత్‌లో బ్రాండ్‌ మోదీ అధికంగా పనిచేస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రచారం చేయకుండానే 182 సీట్లకు 156 స్థానాలు గెలుచుకుంది. ఇది మోదీ ప్రభావం వల్లే అన్నది కాదనలేని వాస్తవం. 1995 నుంచి గుజరాత్‌లో వరుసగా 7 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ప్రస్తుత అసెంబ్లీ ముగిసే నాటికి గుజరాత్‌లో బీజేపీ 32 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటుంది.

బంగాల్‌లో 1977 నుంచి 2011 వరకూ 34ఏళ్ల పాలించిన లెఫ్ట్‌ కంటే ఇది రెండేళ్లే తక్కువ. గుజరాత్‌లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం వీఐపీ సీటుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి వాజ్‌పేయీ, అడ్వాణీ ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోర్‌బందర్‌లోనూ 1991 నుంచి బీజేపీ అప్రతిహతంగా విజయాలు నమోదు చేస్తోంది. రాజ్‌కోట్‌లోనూ 1989 నుంచి బీజేపీకు తిరుగులేదు. ఇక్కడ 2009లో ఒక్కసారి కమలం పార్టీ పరాజయం పాలైంది.

కాంగ్రెస్‌ పార్టీ తన వంతు ప్రయత్నాలు!
మొత్తంగా గుజరాత్‌లో బలీయంగా కనిపిస్తున్న బీజేపీను ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ తనవంతు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయని గట్టి ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్‌ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తగ్గించేందుకు పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ గట్టి ప్రయత్నమే చేశారు. గుజరాత్‌లోని చాలా లోక్‌సభ స్థానాల పరిధిలో ఇటీవల భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర నిర్వహించారు. గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే 7జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఇత్యాది అంశాలు కాంగ్రెస్‌కు ఎంత మేరకు కలిసి వచ్చేది ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహారాష్ట్రలో ఉత్కంఠ పోరు- వదినా-మరదళ్ల మధ్య టఫ్ పైట్- శిందే కూతురు గెలుస్తుందా? - Lok Sabha Election 2024

దక్షిణ కర్ణాటకలో ఆసక్తికర పోరు- బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్​ ఫైట్​- గెలుపు ఎవరిదో? - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.