ETV Bharat / health

నోటి దుర్వాసనతో పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పు - పరిశోధనలో నమ్మలేని నిజాలు! - Mouth Health Problems

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 1:59 PM IST

Mouth Health Problems : మనం ఆరోగ్యంగా ఉండాలంటే నోటి శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధన ప్రకారం.. నోటి అనారోగ్యం కారణంగా ఏకంగా పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందట. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Mouth Health Problems
Mouth Health Problems

Mouth Health Problems : ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. నోటి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత అజాగ్రత్తగానే ఉంటున్నారు. దీనివల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి వివిధ రకాల సమస్యలు వస్తాయని నిపుణులంటున్నారు. ఇటీవల వెల్లడైన పరిశోధనల వివరాల ప్రకారం.. నోటి అనారోగ్యం కారణంగా పెద్దపేగు క్యాన్స్‌ర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు గుర్తించారు. మరి ఈ క్యాన్సర్‌ రాకుండా నోటి ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం తీసుకునే ఆహారంలో విటమిన్‌ C లోపిస్తే చిగుళ్ల నుంచి రక్తం కారుతుందని నిపుణులంటున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు చిగుళ్లను, దంతాలను నెమ్మదిగా తాకినా, తోమినా రక్తం కారడం ఇంకా ఎక్కువవుతుందని తెలియజేస్తున్నారు.

మీరు రాత్రి సరిగ్గా నిద్రపోవడం లేదా? - డైలీ ఈ డ్రింక్స్‌ తాగితే- డీప్‌ స్లీప్‌!! - Drinks for Better Sleep

2017లో "నేచర్ మెడిసిన్" అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నవారి నోటిలో ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం స్థాయిలు ఎక్కువగా కనిపించాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ బాక్టీరియా క్యాన్సర్ పెరుగుదల, వ్యాప్తిని ప్రోత్సహిస్తుందని వారు వెల్లడించారు. ఈ అధ్యయనంలో తైవాన్‌లోని 'నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ తైవాన్‌'లో పని చేసే డా. టి. యు. లి పాల్గొన్నారు. నోటిలో ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం స్థాయిలు ఎక్కువగా ఉంటే పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు.

నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యతో బాధపడేవారు.. డైలీ ఆహారంలో విటమిన్‌ సి ఎక్కువగా ఉండే బత్తాయిలు, నారింజ, జామ, కివీ వంటి పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. బ్రష్‌ చేసుకుంటున్నప్పుడు రక్తం వస్తుంటే దంత వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు. అయితే.. నోటి ఆరోగ్యం పాడైపోతే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

నోటి ఆరోగ్యం విషయంలో ఈ చిట్కాలు పాటించండి:

  • రోజూ ఉదయం, రాత్రి పడుకునేటప్పుడు కచ్చితంగా బ్రష్‌ చేయండి.
  • ఇంకా ఆహారం తిన్న తర్వాత పళ్లను శుభ్రం చేసుకోండి.
  • అలాగే సాఫ్ట్‌గా ఉండే బ్రష్‌లను ఉపయోగించండి.
  • రోజూ తాజా పండ్లు కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోండి.
  • పళ్ల మధ్య ఉన్న ఆహారం శుభ్రం చేసుకోవడానికి ప్రతిరోజూ ఒకసారి ఫ్లాస్ చేయండి.
  • పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి.
  • మీరు చిగుళ్ల నుంచి రక్తం కారడం, తీవ్రమైన నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎండాకాలంలో స్ట్రోక్ ప్రమాదం! ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! - Heart Stroke In Summer

సైక్లింగ్ vs రన్నింగ్ - ఈ రెండిట్లో ఫిటినెస్​కు ఏది మంచిది? - Cycling vs Running For Fitness

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.