ETV Bharat / health

దుకాణాల్లో దొరికే తిండి - ఎందులో ఉప్పు ఎక్కువగా ఉంటుందో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 3:36 PM IST

High Salt Content Foods : బీపీతో బాధపడేవారు తినే ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ.. బయట దొరికే ఆహార పదార్థాల్లో ఎంత ఉప్పు ఉంటుందో మాత్రం వారికి తెలియదు. దాంతో.. తాము ఉప్పు తక్కువగానే తింటున్నామని భావిస్తారుగానీ.. లోపలికి దండిగానే వెళ్తూ ఉంటుంది!

High Salt Content Foods
High Salt Content Foods

High Salt Content Foods : ఎంత ఘుమఘుమలాడే వంట చేసినా.. అందులో కాస్తంత ఉప్పు తక్కువైతే టేస్ట్‌ మొత్తం మారిపోతుంది. అందుకే.. ఇప్పు కావాల్సినంత వేసుకొని తినేస్తుంటారు చాలా మంది. కానీ.. శారీరక శ్రమ లేని వారు.. అధిక ఒత్తిడికి గురయ్యేవారు.. ఊబయకాయం ఉన్నవారు.. చిన్న వయసులోనే బీపీ బారిన పడుతున్నారు. ఇలాంటి వారు ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీంతో.. చాలా మంది కొంత జాగ్రత్తగానే ఉప్పు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నామని భావిచేవారైతే ఇష్టారీతిన ఉప్పు లాగిస్తుంటారు. అయితే.. నిపుణుల లెక్క ప్రకారం రోజులో 5 గ్రాములకన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. చాలా మంది ఈ లెక్కలు తెలియదు. ఇంట్లో వంటల్లో తగ్గిస్తున్నామని అనుకుంటారుగానీ.. బయట తినే తిండి ద్వారా.. తమకు తెలియకుండానే అధిక మొత్తంలో ఉప్పు తినేస్తుంటారు. మరి.. బయట దొరికే ఆహారాల్లో సాల్ట్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ ఐటమ్స్‌ ఏంటో మీకు తెలుసా?

ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు ఇవే!

పిజ్జా: మనలో పిజ్జాను ఎంతో మంది ఇష్టంగా తింటారు. కానీ ఈ పిజ్జాలో వాడే సాస్‌, పిండి, ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌ ఐటమ్స్​లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి వీటిని తరచూ తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సాండ్‌విచ్‌: వీటిలో ప్రాసెస్‌ చేసిన మాంసం, చీజ్‌, సలాడ్‌ వంటివి ఎక్కువగా వేస్తారు. వీటిలో కూడా ఉప్పు అధికంగా ఉంటుందట.

ప్రాసెస్ చేసిన చీజ్ : ఇప్పుడు మార్కెట్లో ప్రాసెస్‌ చేసిన మాంసాహారంతో పాటు చీజ్‌ వంటివి కూడా లభ్యమవుతున్నాయి. ఇందులో కూడా సాల్ట్‌ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎండిన మాంసం : ఫ్రై చేసిన మాంసాన్ని కూడా దుకాణాల్లో అమ్ముతుంటారు. వీటిలో కూడా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది.

పచ్చళ్లు : మనం ఎక్కువగా తినే మామిడికాయ, ఉసిరి, వంటి వివిధ రకాల పచ్చళ్లలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

సాస్‌లు : ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా వినియోగించే సోయా సాస్, టొమాటో సాస్ వంటి వాటిలో సాల్ట్ కంటెంట్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని వీలైనంత తక్కువగా వాడుకోవాలి.

బ్రెడ్ : ప్రాసెస్‌ చేసిన మాంసం, చీజ్‌లాగే.. పాలు, టీలో ముంచుకు తినే బ్రెడ్‌ లో కూడా ఉప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందట.

కుకీస్‌: చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే కుకీస్‌లలో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని తినడం వీలైనంత తగ్గించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ప్యాక్డ్ ఫుడ్: పిల్లలు ఎక్కువగా తినే చిప్స్ నుంచి రకరకాల పదార్థాల వరకు దుకాణాల్లో ప్యాకెట్ల రూపంలో లభిస్తుంటాయి. ఇవన్నీ అత్యధికంగా ఉప్పును కలిగి ఉంటాయి. కాబట్టి.. వీటిని అస్సలే ముట్టుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అర్ధరాత్రి మీ ఒంట్లో ఈ లక్షణాలు - ముంచుకొస్తున్న ప్రమాదానికి సంకేతం కావొచ్చు!

మైక్రో ఓవెన్​ ఎలా క్లీన్​ చేస్తున్నారు? - ఈ టిప్స్​ పాటిస్తే వెరీ ఈజీ!

వేకువజామునే గుండెపోటు ముప్పు- సోమవారాల్లో మరింత అధికం- కారణం ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.