ETV Bharat / health

మీకు పైనాపిల్​ అంటే ఇష్టమా? వేసవి కాలంలో తింటే ఏం జరుగుతుందో తెలుసా ? - Health Benefits Of Pineapple

author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 4:23 PM IST

Health Benefits Of Pineapple: పైనాపిల్‌ను కట్‌చేసి తినడం కొద్దిగా కష్టమే గానీ.. ఆ ముక్కల రుచి మాత్రం చాలా బాగుంటుంది. అయితే పుల్లపుల్లగా.. తీయతీయగా ఉండే అనాస పండును వేసవి కాలంలో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీకు తెలుసా ?

Health Benefits of Eating Pineapple
Health Benefits of Eating Pineapple in Summer (ETV Bharat)

Health Benefits of Eating Pineapple in Summer: సమ్మర్‌లో ఎండవేడి, ఉక్కపోత, చెమట కారణంగా మన శరీరం తరచూ డీహైడ్రేట్‌ అవుతుంటుంది. దీనివల్ల అలసట, అజీర్తి వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే, ఎండాకాలంలో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాంటే.. మన డైట్‌లో తాజా పండ్లు, జ్యూస్‌లు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో పైనాపిల్‌ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. మరి ఆ హెల్త్‌ బెన్‌ఫిట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

పోషకాలు ఎన్నో: పైనాపిల్‌లో మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, క్యాలరీలు, విటమిన్ సి, ఎ, కాల్షియం, ఐరన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వీటితో పాటు థయామిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ బి6, ఫోలేట్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, బీటా కెరోటిన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి.

రక్తపోటు తగ్గుతుంది : పైనాపిల్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడేవారు సమ్మర్‌లో పైనాపిల్‌ తినాలని నిపుణులంటున్నారు.

చక్కెర స్థాయిలు అదుపులో : తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉండే పండ్లలో పైనపిల్‌ ఒకటి. దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరగవు! అందుకే షుగర్‌ ఉన్నవారు పైనాపిల్‌ను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే జ్యూస్​ తాగినప్పుడు మాత్రం చక్కెర కలుపుకోవద్దని సూచిస్తున్నారు.

డైలీ బీరు తాగుతున్నారా? - ఈ ప్రాణాంతక జబ్బులు ఎటాక్ చేయడం గ్యారెంటీ! - Side Effects of Drinking Beer Daily

రోగనిరోధక శక్తి పెరుగుతుంది : విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లలో పైనాపిల్‌ ఒకటి. సమ్మర్‌లో తరచూగా పైనాపిల్‌ను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వేసవికాలంలో వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుందని తెలియజేస్తున్నారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : పైనాపిల్‌లో బ్రొమెలనిన్‌ అనే ఎంజైమ్‌ అధికంగా ఉంటుంది. ఇది వేసవి కాలంలో వచ్చే కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనాస పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగించి.. ఎక్కువ తినకుండా చేస్తుంది.

బాడీని హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది : పైనాపిల్‌లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. డీహైడ్రేషన్ వల్ల కలిగే అలసట, తలనొప్పి, కండరాల తిమ్మిరి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే సమ్మర్‌లో వీటిని తరచుగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 2010లో 'జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ & మెడిసిన్' లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పైనాపిల్ జ్యూస్ తాగిన వ్యక్తులు.. నీరు మాత్రమే తాగిన వ్యక్తుల కంటే మంచి హైడ్రేషన్ స్థాయిలను కలిగి ఉన్నారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ A&M యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. డేవిడ్ డీ. బ్రౌన్ పాల్గొన్నారు. పైనాపిల్ లోని అధిక నీరు డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజ్​ వాటర్​ను డైలీ వాడుతున్నారా? ఎన్ని ప్రయోజనాలో తెలుసా? - BENEFITS OF ROSE WATER

ఎంతటి మొటిమలైనా ఈ టిప్స్​ పాటిస్తే క్లియర్​​! మీరూ ట్రై చేస్తారా? - Tips to Prevent Acne Problems

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.